దీపావళికి అక్కడ ఇక్కడ సందడి చేసే సినిమాలు ఇవే

0

పండుగ అంటే సినిమాల విడుదల విషయంలో హడావుడి ఉంటుంది. కాని గత ఏడు నెలలుగా థియేటర్లు మూత బడి ఉన్నాయి. మళ్లీ తెరచేందుకు కేంద్రం కండీషన్స్ తో కూడిన అనుమతులు ఇచ్చింది. అయినా కూడా తియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. దసరాకు కొన్ని థియేటర్లు అయినా నడుస్తాయని భావించారు. కాని ఎక్కడ కూడా పెద్దగా థియేటర్లు ఓపెన్ అయిన దాఖలాలు కనిపించలేదు. ఇక దీపావళికి కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దీపావళికి కూడా ఓటీటీ సినిమాలే ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ను అందించబోతున్నాయి.

దీపావళి సందర్బంగా తెలుగు పెద్ద సినిమాలు ఏమీ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. కాని తమిళంకు చెందిన మూడు సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆ మూడు సినిమాలు తెలుగులో కూడా సందడి చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నవంబర్ 12న విడుదల కాబోతున్న సూర్య సూరారైపోట్రు సినిమా తెలుగులో ఆకాశమే నీ హద్దురా తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఇక నయనతార నటించిన తమిళ మూవీ మూకుత్తి అమ్మన్ సినిమాను తెలుగులో అమ్మోరు తల్లిగా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా ఓటీటీ ద్వారా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా జయం రవి మరియు నిధి అగర్వాల్ జంటగా నటించిన రైతుల ఆత్మహత్యలు మరియు వ్యవసాయ రంగంపై తెరకెక్కిన భూమి సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ మూడు సినిమాలు దీపావళికి తమిళ ప్రేక్షకులను మరియు తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాయి.