సుశాంత్ ది హత్యే.. ప్రత్యక్ష సాక్షి సంచలనం

0

సీబీఐకి అప్పగించిన తరువాత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు మలుపులు తిరుగుతున్నది. దర్యాప్తులో వేగం పెరుగుతోంది. తాజాగా సుశాంత్ ది హత్యేనని ప్రాథమిక ఆధారాలు లభించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాజాగా సుశాంత్ మృతదేహం వెళ్లిన కూపర్ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది సంచలన విషయాలను రిపబ్లిక్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

సుశాంత్ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తీసుకువచ్చారని.. స్వయంగా బాడీని నేను అంబులెన్స్ లో నుంచి దించానని.. ఆ సమయంలో సుశాంత్ దేహాన్ని చూసి డాక్టర్లు ఇది ఆత్మహత్య కాదని.. హత్య అన్నారని ఆస్పత్రిలో పనిచేసే పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి చెప్పారు. ఉరివేసుకుంటే నాలుక బయటకు వస్తుందని.. మలమూత్రాలు బయటకు వస్తాయని.. అలాంటిది సుశాంత్ ముఖంలో కానీ.. దేహంలో కానీ కనిపించలేదని తెలిపాడు.

సుశాంత్ రెండు కాళ్లు విరిగి ఉన్నాయని.. ఒక కాలు సన్నగా.. మరో కాలు లావుగా ఉందని.. ఆయన కాళ్లు విరిగి.. మెడకు సూదిపోట్లు కనిపించాయని.. ఆయనది హత్యననే అనిపిస్తోంది.

సుశాంత్ మృతదేహాన్ని రియా చక్రవర్తితోపాటు మరో ఇద్దరు వచ్చి చూశారని.. ‘సారా బాబు’ అని ఏడ్చిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పోలీసులకు కూడా ఈ విషయం చెప్పలేదని.. నాకు ఒక ప్యామిలీ ఉందని.. చంపేస్తారని భయంగా ఉందని.. తన పేరు బయటపెట్టవద్ధని జాతీయ చానెల్ రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ప్రత్యక్ష సాక్షి నిజాలు వెల్లడించారు.