Templates by BIGtheme NET
Home >> Cinema News >> మాదక ద్రవ్యాల కొనుగోలులో రియా కోడ్ లాంగ్వేజ్?

మాదక ద్రవ్యాల కొనుగోలులో రియా కోడ్ లాంగ్వేజ్?


సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో రోజుకో మలుపు వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ నేపథ్యంలో మాదక ద్రవ్యాల కొనుగోళ్లు డ్రగ్ దందాపై విచారణ సాగిస్తున్నారు. ఇక ఈ కేసు విషయమై రియాకు వ్యతిరేకంగా లోకం అంతా ప్రూఫ్ లు చూపించే ప్రయత్నం చేస్తోంది. సుశాంత్ సింగ్ కుటుంబీకుల్లో అతడి సోదరి కీర్తి సింగ్ అయితే రియాపై ఏకుమేకై ఫైరైపోతోంది.

రియా చక్రవర్తి ఆగడాలపై అంతెత్తున ఎగిరి పడుతోంది కీర్తి సింగ్. ముఖ్యంగా రియా నేరుగా జాతీయ చానెళ్ల లైవ్ కి వెళ్లి సుశాంత్ గంజాయిని తీసుకునేవాడని వెల్లడించడంతో ఆ ఇంటర్వ్యూపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ కీర్తి రియా ప్రకటనలకు సూటిగానే కౌంటర్లు వేస్తోంది.

తాజాగా కీర్తి సింగ్ కొన్ని వాట్సాప్ చాట్ల స్క్రీన్ షాట్లను షేర్ చేసి రియా క్యారెక్టర్ గురించి బయటపెట్టే ప్రయత్నం చేసింది. ఆయుష్ ఎస్.ఎస్.ఆర్- టీం ఎస్.ఎస్.ఆర్- ఆనందీ ఎస్.ఎస్.ఆర్ – సిద్ధార్థ్ పిథాని ఎస్.ఎస్.ఆర్ – శామ్యూల్ మిరాండా- చోకో షోయిక్ రియా-రియా చక్రవర్తి పేర్లు ఉన్న కొన్ని వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను ప్రదర్శించారు. ఇవి చూశాక ‘మనం ఏమి తేల్చుకోవాలి?’ అని ప్రశ్నించింది. సుశాంత్ కేసులో దోషుల్ని అరెస్టు చేయాలని కోరింది.

ఇంతకీ ఆ చాట్లలో ఏం ఉంది? అంటే.. ‘డూబీస్’.. ‘స్టఫ్’ గురించి చాలా తరచుగా ప్రస్తావించారు. రియా చక్రవర్తి నుండి వచ్చిన సందేశాల్లో కూడా ‘డూబీ అవసరం’ ఉంది.. అని.. ‘రోలింగ్ అండ్ గెట్టింగ్’ అని ఉంది. ‘డూబీస్’ .. ‘స్టఫ్’ అనే పదాలతో ఉన్న ఈ చాట్ లు డ్రగ్స్ కి కోడ్ లాంగ్వేజా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ చాట్లు జూలై 2019 నుండి వచ్చాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే ఒక స్క్రీన్ షాట్ లో ఎకె 47 బ్లర్ బ్లూబెర్రీ కుష్ అని ఉంది. రియాను అరెస్టు చేసేందుకు ఇంతకంటే ప్రూఫ్ అవసరం లేదని కీర్తి సింగ్ అంటున్నారు. మరి దీనికి రియా కౌంటర్ ఏమిటో?