కంగనను దుబాయ్ కి సప్లయ్ చేయాలనుకున్న పెద్ద మనిషి?

0

చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల గురించి బాలీవుడ్ పార్టీల గురించి కంగనా రనౌత్ పబ్లిగ్గా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాను గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు అంగీకరించిన కంగన బాలీవుడ్ పార్టీల్లో కొకైన పార్టీ చాలా స్పెషల్ అని చెప్పడం షాకిచ్చింది. హీరోల బాలీవుడ్ ప్రముఖుల రక్త శాంపిళ్లు తీసుకుంటే గుట్టు తెలిసిపోతుందని వెల్లడించింది. అంతేకాదు భట్స్ క్యాంప్ పై కంగన నర్మగర్భ వ్యాఖ్యలు మార్మిక వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపుతున్నాయి. తనకు గ్యాంగ్ స్టోరి వినిపించేందుకు పిలిచి దుబాయ్ మనుషుల మధ్య కూచోబెట్టారని.. తనని దుబాయ్ కి సరఫరా చేసేయడం వీళ్లకు చాలా తేలిక అని భావించానని వ్యాఖ్యానించింది ఓ ఇంటర్వ్యూలో.

తాజాగా కంగనా ఓ ప్రముఖ వార్తా చానెల్ తో మాట్లాడుతూ.. తాను `క్యారెక్టర్ యాక్టర్` అని పేర్కొన్న వ్యక్తి నుంచి గతంలో డ్రగ్స్ తీసుకున్నట్లు నటి వెల్లడించింది. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం గురించి కూడా ఓపెన్ గా మాట్లాడారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం గురించి కూడా ఈ నటి షాకిచ్చే కామెంట్లు చేసింది. సుశాంత్ సింగ్ కి మాదకద్రవ్యాల్ని బలవంతంగా అలవాటు చేశారని.. అతని మనస్సు విరిచేసి… అతని హత్యకు కుట్ర చేశారని కంగన పేర్కొంది. రియా చక్రవర్తి గంజాయి కోసం ఏర్పాట్లు చేసి ఉండవచ్చని ఇది కొన్ని దేశాలలో చట్టబద్ధంగా అమ్ముడవుతుందని విదేశాల నుంచి రప్పించేదని నటి పేర్కొంది.

సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఎల్.ఎస్.డి వంటి మాదకద్రవ్యాలను సేవించేంత చెత్త నేపథ్యం నుంచి రాలేదని ఆమె అన్నారు. బాలీవుడ్ పరిశ్రమను మాదకద్రవ్యాలతో సంబంధం కలిగి ఉన్న పరిశ్రమగానే చూస్తానని అన్నారు. దీనిని గట్టర్ అని కూడా పిలిచింది. తన 16 ఏళ్ళ వయసులో మనాలిని విడిచిపెట్టడం ఎంత కష్టమో చెప్పింది. ముంబైలో ఒక ఆంటీతో కలిసి జీవించడం ప్రారంభించానని పేర్కొంది. తాను క్యారెక్టర్ యాక్టర్ అని పిలిచే వ్యక్తితో స్నేహం చేశానని కంగన తెలిపింది. ఈ వ్యక్తి ఆమెను దుబాయ్ నుంచి వచ్చే వారితో సమావేశాలకు తీసుకువెళతారని కంగనా వెల్లడించి షాకిచ్చింది.

దుబాయ్ వ్యక్తుల మధ్య లో తనను కూర్చోబెట్టారని.. ఆ తర్వాత ఆ వ్యక్తి వెళ్లిపోతాడని తెలిపింది. ఆ సమయంలో తనను దుబాయ్ కు ఎలా సరఫరా చేయవచ్చో వీళ్లకు తెలుసని భావించానని కంగనా పేర్కొంది. భట్ సోదరుల తో గ్యాంగ్ స్టర్ చిత్రం గురించి చర్చించేప్పటి లోగుట్టును అలా బయటపెట్టేసింది. పర్వీన్ బాబీ మార్గంలో సుశాంత్ ని పంపుతామని భట్స్ అన్నారట. `స్వయం నియమిత గురువు` (మహేష్ భట్ అని మీనింగ్) సూచిస్తే ఎవరైనా.. పర్వీన్ బాబీ లాగా అవుతారని.. తాను కూడా అలానే అవుతానని తనకు చెప్పారని కంగనా పేర్కొంది. ఇంతకీ భట్స్ కి కంగనకు మధ్య ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కం మీడియేటర్ ఎవరు? ఇక తనను అవకాశం పేరుతో దుబాయ్ కి పంపాలనుకున్నారా? అన్న ప్రశ్నలకు సూటిగా ఆన్సర్ అయితే లేదు. అంతా నర్మగర్భంగానే మాట్లాడింది క్వీన్.