చిక్కుల్లో గుంజన్ సక్సేనా.. లింగ వివక్షతో చిక్కులే!

0

జాన్వీ కపూర్ నటించిన `గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్` చిత్రం సెప్టెంబర్ లో డిజిటల్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ వీక్షించాక రకరకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయ వైమానిక దళ అధికారుల తరపున చిత్ర నిర్మాతలపై ఓ ఎన్జీవో సంస్థ కోర్టు కేసు వేయడం వేడెక్కించింది. ప్రస్తుతం కోర్టుల పరిధిలో విచారణ సాగుతోంది. గంజన్ సక్సేనా రిలీజ్ ని ఆపాలని.. ఇందులో అవాస్తవికంగా చిత్రీకరించిన సన్నివేశాల్ని తొలగించాలని.. అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని హైకోర్టు తాజాగా ఆదేశించింది.

న్యాయవాది అమిత్ కుమార్ శర్మ ఈ కేసు విషయమై పోరాడుతున్నారు. ఆయనకు చెందిన ఎన్జీవో.. జస్టిస్ ఫర్ రైట్స్ ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. ప్రతిష్టాత్మక భారతీయ వైమానిక దళా(ఐఎఎఫ్) న్ని పరమ చెత్తగా సన్నివేశాల్లో చిత్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ చిత్రంలోని అభ్యంతరకరమైన సంభాషణలు సన్నివేశాలను సవరించడానికి లేదా తొలగించాలని పిటిషనర్ వాదించగా.. కోర్టు ఆ మేరకు ఆదేశాలను జారీ చేసింది.

సృజనాత్మకత.. కళాత్మక స్వేచ్ఛ పేరుతో భారత వైమానిక దళాన్ని అనవసరమైన రాంగ్ వేలో చిత్రీకరించడం సరికాదు.ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు సంభాషణలు వాస్తవంగా తప్పుదారి పట్టించేవిగా చిత్రీకరించారు. మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా వెండితెర పాత్రను కీర్తింపజేయడానికి మేల్ అధికారుల్ని బలి పెట్టారు.. అని పిటిషనర్ వాదించారు.

అంతేకాదు వైమానిక దళంలో మగ అధికారులను మిసోజినిస్టులుగా తెరపై చూపించారు. అందుకే ఆయా సన్నివేశాలన్నిటినీ విడుదలకు ముందే ధర్మ ప్రొడక్షన్స్ తొలగించాలని కోర్టు కోరింది. IAF ను ప్రతికూల విధానంలో చిత్రీకరించే అభ్యంతరకరమైన దృశ్యాలు ఉండకూడదని తెలిపింది. ఈ చిత్రంలో చిత్రీకరించిన లింగ వివక్ష ప్రధానంగా చర్చకు వచ్చింది. తప్పుడు విధానంలో తప్పుదోవ పట్టించేదిగా మేల్ అధికారుల్ని చూపారని న్యాయవాది తన వాదనలో పేర్కొన్నారు.

ప్రతిష్టాత్మకమైన భారత వైమానిక దళం సంస్థలో లింగ వివక్ష కేవలం తటస్థంగా ఉందని మగ – ఆడ అనే తేడా లేకుండా మహిళా సిబ్బందికి సమాన అవకాశాన్ని ఎల్లప్పుడూ కల్పించిందని పిటిషనర్ తెలిపారు. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) అత్యధిక సంఖ్యలో మహిళా అధికారులను ఎంపిక చేసుకుని పనిచేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. 2015 లో యుద్ధంలో మహిళా అధికారులకు భారతీయ వైమానిక దళం అవకాశం కల్పించిందని గుర్తు చేశారు.