`బ్లాక్ పాంథర్` నటుడు చాడ్విక్ బోస్మాన్ మృతి

0

బ్లాక్ పాంథర్ స్టార్ చాడ్విక్ బోస్మాన్ కోలన్ (43) క్యాన్సర్ కి చికిత్స పొందుతూ కన్నుమూశారు. మార్వెల్ సినిమాటిక్ విశ్వంలో బ్లాక్ పాంథర్ చిత్రం సాధించిన సంచలన విజయం గురించి తెలిసిందే. ఈ సినిమాలో నటుడు చాడ్విక్ బోస్మాన్ నట ప్రతిభ అబ్బురపరుస్తుంది. ఆయన 43 సంవత్సరాల వయసులో క్యాన్సర్ తో మరణించాడు. చాడ్విక్ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ వార్తను షేర్ చేశారు.

మార్షల్ నుండి ది ఫైబ్ బ్లడ్స్ వరకు చాడ్విక్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆగస్టు నుంచి ఆయనకు క్యాన్సర్ తగ్గించేందుకు లెక్కలేనన్ని శస్త్రచికిత్సలు చేశారు. చాడ్విక్ బోస్మాన్ 2016 లో స్టేజ్ త్రీ కోలన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత.. ఈ రోజు (2020 ఆగస్టు 29 న) కన్నుమూశారు.

చాడ్విక్ బోస్మాన్ దక్షిణ కెరొలినలోని అండర్సన్ లో పుట్టి పెరిగాడు. 2003 లో తన మొదటి టెలివిజన్ పాత్రను థర్డ్ వాచ్ ఎపిసోడ్ లో నటించాడు. తరువాత అతను ది కిల్ హోల్- 42- డ్రాఫ్ట్ డే- గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్- మెసేజ్ వంటి చిత్రాలలో నటించాడు. 2018 బ్లాక్ బస్టర్ బ్లాక్ పాంథర్ లో కథానాయకుడిగా చక్కని నటనతో ఆకట్టుకున్నారు. మార్వల్ నిర్మించిన అవెంజర్స్ ఎండ్ గేమ్.. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ చిత్రాల్లోనూ నటించాడు.