రిలీజ్ డేట్ ని లాక్ చేసి పెట్టిన ‘ఆచార్య’…?

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా గత కొరటాల శివ చిత్రాల శైలిలోనే కమర్షియల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘ఆచార్య’ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక ‘ఆచార్య’ చిత్రాన్ని 2021 సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాగా ‘ఆచార్య’ సినిమాని ముందుగా ఈ ఏడాదే రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో శరవేగంగా చిత్రీకరణ చేశారు. అయితే అదే సమయంలో కరోనా మహమ్మారి వచ్చి షూటింగ్ కి బ్రేక్ వేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఐదున్నర నెలల సమయం షూట్ లేకుండానే గడిచిపోయింది. దీంతో పరిస్థితులు చక్కబడి చిత్రీకరణ పూర్తి చేయడానికి సమయం పట్టే అవకాశం ఉందని భావించిన మేకర్స్ ‘ఆచార్య’ ని వచ్చే ఏడాది సమ్మర్ కి తీసుకొస్తామని ప్రకటించారు. అయితే 2021 ఏప్రిల్ 9వ తేదీని లాక్ చేసి పెట్టి ఎట్టిపరిస్థితుల్లో ‘ఆచార్య’ని రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.

టాలీవుడ్ లో చాలామంది హీరోలు దర్శకనిర్మాతలు ఏప్రిల్ 9వ తేదీని సెంటిమెంట్ గా భావిస్తారు. ఆ డేట్ కి రిలీజైతే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతారు. అందుకే ఈ డేట్ ని దృష్టిలో పెట్టుకొని సినిమాని కంప్లీట్ చేయమని కొరటాల శివకి ప్రొడ్యూసర్స్ సూచించారట. మరి కరోనా మహమ్మారి ‘ఆచార్య’ టీమ్ అనుకున్న సమయానికి పూర్తయ్యేలా కోపరేట్ చేస్తుందేమో చూడాలి.