సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం వెనక కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రియా చక్రవర్తిపై సుశాంత్ కుటుంబం పోలీస్ కేసులు నమోదు చేసి కోర్టుల్లో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సోదరి శ్వేతా సింగ్ తో సుశాంత్ కి సత్సంబంధాలు లేవని ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపించింది. అతడికి కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపించడం సంచలనమైంది.
కానీ ఈ కేసులో ముంబై పోలీసులు.. సీబీఐ దర్యాప్తు చెబుతున్న నిజాలు వేరేగా ఉన్నాయి. సుశాంత్ మరణించి రెండు నెలలైంది. సీబీఐ ఈడీ దర్యాప్తుల్లో రకరకాల నిజాలు నిగ్గు తేల్తున్నాయి. ఈ ఆదివారం సోషల్ మీడియాలో సుశాంత్ నలుగురు సోదరీమణులతో కలిసి ఉన్న ఒక అపురూపమైన.. అమూల్యమైన వీడియోను సోదరి శ్వేత స్వయంగా షేర్ చేశారు.
`ఎంఎస్ ధోని: ది అన్టోల్డ్ స్టోరీ` విడుదల సమయంలోని వీడియో ఇది. ఈ వీడియోలో సుశాంత్ కి తన సోదరీమణులు అంటే ఎంత ప్రేమాభిమానాలో బయటపడింది. వీడియోను షేర్ చేసి శ్వేతా ఆవేదనతో కూడిన క్యాప్షన్ ఇచ్చింది. “ఆనందం ఉంది.. మేం ఎంతో ఆనందించాం. కలిసి సూర్యుని ఎండలో గడిపిన క్షణాలు ఉన్నాయి. కానీ ఆ చిరునవ్వు హుషారు ఆ సీజన్లు అన్నీ పోయాయి. మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను … ఎల్లపుడూ నీవు మాతోనే ఉంటావు“ అంటూ ఎమోషనల్ అయ్యింది.
ఈ వీడియోతో పాటు సుశాంత్ చిన్ననాటి ఫోటోను కూడా శ్వేతా పంచుకున్నాడు. దానికి ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చారు. “మీరు దేనినైనా విశ్వసించినప్పుడు దాని కోసం పోరాడండి. అన్యాయాన్ని చూసినప్పుడు మీరు ఇంతకుముందు పోరాడిన దానికంటే కష్టపడతారు“ అంటూ బ్రాడ్ మెల్ట్జర్ కొటేషన్ ని షేర్ చేశారు. సీబీఐ దర్యాప్తులో సుశాంత్ కుటుంబానికి న్యాయం జరగాలని అభిమానుల డిమాండ్లు అంతకంతకు వేడెక్కిస్తున్న సంగతి తెలిసినదే. న్యాయం కోసం సిస్టర్స్ పోరాటం ఫలిస్తుందనే ఆశిద్దాం.
“We had joy, we had fun!
We had seasons in the sun ☀️
But the smile and the song
Like the seasons have all gone”
How I wish we were all together again…❤️ #Youwillstayinourheartsforever #comeback @itsSSR pic.twitter.com/HJNF3fUTg5— shweta singh kirti (@shwetasinghkirt) August 16, 2020
TeluguNow.com Telugu cinema news, Movie reviews, Telugu Movies Updates, OTT News, OTT Release dates, Latest Movie reviews in Telugu, Swathi weekly, Telugu cinema reviews, telugu movie reviews, Telugu Actress Photos, Telugu Movie HQ Photos, Tollywood, Box office collections, Telugu Movie show times, Theater List, telugu cinema tickets
				