సుశాంత్ మరణం కేసు కీలక మలుపు

0

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక అందరూ అనుమానిస్తున్నది ఆయన ప్రియురాలు రియా చక్రవర్తినే. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ డ్రగ్ డీలరుతో జరిపిన వాట్సాప్ చాటింగ్ బయటకొచ్చింది. దీన్ని పరిశీలించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిందీ. దీంతో సుశాంత్ కేసు కీలక మలుపు తిరిగింది.

సుశాంత్ మరణానికి డ్రగ్స్ కూడా కారణమని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రియా డ్రగ్ వ్యాపారి గౌరవ్ ఆర్యతో చాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. సీబీఐ దర్యాప్తులో రియాకు సంబంధించిన కీలక విషయాలను సుశాంత్ స్నేహితుడు పితాని సిద్ధార్త్ ఈ గుట్టు బయటపెట్టినట్టు సమాచారం.

జూన్ 8న సుశాంత్ తో రియా చక్రవర్తి తీవ్రంగా గొడవపడిందని.. జూన్ 15న సుశాంత్ మరణించడం వెనుక అదీ ఒక కారణం కావచ్చని సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ సీబీఐకి తెలిపాడు.

ఇక సుశాంత్ నివాసంలో ఆధారాలు దొరకకుండా 8 హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేయడం..సుశాంత్ మేనేజర్ వంటమనిషి అక్కడే ఉన్నారని వివరించాడు. హార్డ్ డిస్క్ ల్లో ఏముందో తెలియదని సిద్ధార్థ్ తెలిపాడు.

రియా సమక్షంలోనే హార్డ్ డిస్క్ ల ధ్వంసం జరిగినట్లు సీబీఐకి ఆధారాలు లభించినట్లు సమాచారం. దీంతో డ్రగ్స్ లింకుతోనే రియా… సుశాంత్ ను చంపిందా అన్న కోణంలో సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోందని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.