వరుణ్ తేజ్ మూవీ ఊసే లేదుగా…!

0

మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం నుండి విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ కొర్రపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) మరియు సిద్ధు ముద్దా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న మూవీ కావడంతో కఠినమైన వర్కౌట్స్ చేసి మంచి ప్రొఫెషనల్ బాక్సర్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు వరుణ్ తేజ్. అయితే కరోనా మహమ్మారి వచ్చి #VT10 కి బ్రేక్స్ వేసింది.

కాగా ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అయిన తరువాత ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. లాక్ డౌన్ లో సినిమా షూటింగ్స్ లేకపోయినా హీరోలందరూ తమ సినిమాలకి సంబంధించిన ఏదొక అప్డేట్ ఇస్తున్నారు. అయితే వరుణ్ మూవీ నుంచి ఏదైనా న్యూస్ వస్తుందేమో అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వరుణ్ కూడా ఈ సినిమా పై క్లారిటీ మిస్ అయిందేమో అని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుణ్ తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడని ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 3’ తో పాటు ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీని కూడా వరుణ్ ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో వరుణ్ పోలీసుగా కనిపిస్తాడట. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ ని ఒకేసారి సెట్స్ మీదకు తీసుకొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. వీటితో పాటు VT10 గురించి కూడా త్వరలోనే ఏదైనా అప్డేట్ వస్తే బాగుంటుందని మెగా అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.