కేజీఎఫ్ 2 లో ప్రకాష్ రాజ్ ఏంటీ?

0

కన్నడ సూపర్ హిట్ చిత్రం కేజీఎఫ్ కు ప్రస్తుతం సీక్వెల్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తి చేశారు. ఇప్పుడు సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. కేజీఎఫ్ కేవలం ట్రైలర్ మాత్రమే అని అసలు సినిమా కేజీఎఫ్ 2 లో ఉంటుందని దర్శకుడు చేసిన వ్యాఖ్యలతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈసారి బాలీవుడ్ టార్గెట్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు కూడా కనిపించబోతున్నారు.

ఈ సినిమాలో ఒక చిన్న పాత్రను ప్రకాష్ రాజ్ తో చేయిస్తున్నారు. ఇటీవలే ప్రశాంత్ నీల్ ఆయనపై సీన్స్ చిత్రీకరణ ప్రారంభించినట్లుగా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఏ పాత్రలో కనిపిస్తాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. మొదటి పార్ట్ కథను రచయితగా అనంత్ నాగ్ చెప్పడం జరిగింది. ఇక సెకండ్ పాత్రను ఆయన కాకుండా మరో రచయితగా ప్రకాష్ రాజ్ కంటిన్యూ చేస్తాడని అంటున్నారు. లేదంటే అనంత్ నాగ్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా కథ నరేషన్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది.

మొత్తానికి కేజీఎఫ్ లో విలక్షణ నటుడు ఏంటీ అనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరోనా రాకుండా ఉంటే సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలనుకున్నారు. కాని ఇప్పుడు వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా మొదటి పార్ట్ కంటే రెండు రెట్ల అధిక బిజినెస్ చేయడంతో పాటు భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్ మరియు ప్రేక్షకులు ఉన్నారు.