బాలీవుడ్ పార్టీల్లో కొకైన్ ఫేవరెట్ డ్రగ్.. మరి టాలీవుడ్ పార్టీల్లో?

0

క్వీన్ కంగన రనౌత్ బాలీవుడ్ మాఫియాని చెడుగుడు ఆడేస్తున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఏ- లిస్టర్స్ అంటూ ఒక సెక్షన్ స్వపక్షపాతాన్ని ఏకి పారేస్తోంది. కంగనకి మెంటల్ హై క్యా అంటే ఏమిటో అందరికీ తెలిసొచ్చేలా చేస్తోంది. ఇక ఇన్నాళ్లు ఇండస్ట్రీలో గుట్టుమట్టుగా సాగిపోయే పార్టీల భోగోతాన్ని కూడా ఈ అమ్మడు బయట పెట్టేస్తోంది. తాజాగా బాలీవుడ్ పార్టీల్లో కిక్కు వెనక లోగుట్టును బయటపెట్టేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంతకీ బాలీవుడ్ మందు పార్టీల్లో కీలకంగా ఉపయోగించేది ఏది? అన్న ప్రశ్నకు.. బాలీవుడ్ పార్టీల్లో కొకైన్ మత్తు చాలా ఫేవరెట్ అంటూ ప్రకటించి హీట్ పెంచింది. ఎక్కువమంది సెలబ్రిటీలు కొకైన్ తీసుకునేందుకు కిక్కులో జోగేందుకు తెగ ఆసక్తిని చూపిస్తారట. అన్నట్టు పార్టీకి వెళ్లిన వాళ్లంతా కొకైన్ డ్రగ్ ని ఉచితంగానే పుచ్చుకోవచ్చట. అయితే ఇది అనధికారికంగా ఇన్నాళ్లు అందరికీ తెలిసినదే అయినా ఇలా కంగన నోట రావడంతో నిప్పు రాజుకుంటుందనడంలో సందేహమేం లేదు.

బాలీవుడ్ లో ఎ-లిస్టర్లందరికీ డ్రగ్స్ టెస్టులు చేయాలని పట్టుబడితే లోనేయాలని ఇప్పటికే పోలీసుల్ని కోరుతోంది కంగన. అంతా బాగానే ఉంది.. బాలీవుడ్ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నా.. ఇంతకుముందు టాలీవుడ్ పార్టీల్లో క్లబ్బులు పబ్బుల్లో ఔటర్ రిసార్టుల్లో ఉపయోగించే డ్రగ్- మాదక ద్రవ్యాల గురించి కూడా పోలీసులు ఆరాలు తీసారు. అప్పట్లోనే సిట్ దర్యాప్తులో తెలిసిన నిజాలు బయటి ప్రపంచానికి పూర్తిగా ఆవిష్కరించలేదు కానీ.. కళ్లు తేలేసే సంచలనాలే ఉన్నాయన్న గుసగుసలు వినిపించాయి. అంతా గప్ చుప్.. అదంతే!!