అది దావూద్ ఇబ్రహీం కాదు స్టార్ కపుల్ కు ఊరట

0

ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంతో స్టార్ కపుల్ దీపిక పదుకునే రణ్ వీర్ సింగ్ లు డిన్నర్ చేస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ ఇష్యూ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఒక ఫొటో వైరల్ అవ్వడం చర్చనీయాంశం అవుతోంది. సుశాంత్ ఫ్యాన్ పేజీలో ఈ ఫొటో పోస్ట్ అవ్వడంతో అందరు కూడా ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ లో చాలా మందికి దావూద్ తో సంబంధాలు ఉన్నాయని ప్రచారం ఉంది. ఇప్పుడు ఈ ఫొటోతో అది నిజమే అంటూ నిర్థారణ అయ్యిందని అంటున్నారు. అయితే అసలు విషయం ఏంటీ అంటే అందులో ఉన్నది దావూద్ ఇబ్రహీం కాదు.

2013లో దీపిక పదుకునే మరియు రణ్ వీర్ సింగ్ జంటగా గోలియోంకి రాస్ లీలా రామ్ లీలా అనే చిత్రం రూపొందింది. ఆ సినిమా సందర్బంగా సంజయ్ లీలా భన్సాలీ మరియు ఇతర చిత్రయూనిట్ సభ్యలు ఇలా ఫొటో దిగారు. ఫొటోలో ఎదురుగా ఉన్న వరుసలో మద్య వ్యక్తి దావూద్ ను పోలి ఉండటంతో ఈ చర్చ మొదలైంది. అయితే ఈ ఫొటోలో ఉన్నది ఆర్ట్ డైరెక్టర్ వాసిక్ ఖాన్ అని తేలిపోయింది. దాంతో సోషల్ మీడియాలో దీపిక పదుకునే మరియు రణ్ వీర్ సింగ్ లపై వస్తున్న ట్రోల్స్ కు ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. సోషల్ మీడియాలో అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి అయినా నెటిజన్స్ కాస్త అలర్ట్ గా ఉండటం మంచిది.