సుశాంత్ సింగ్ కి తండ్రితో విభేధాలు నిజమా?

0

వర్ధమాన కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆకస్మిక మరణంపై రకరకాల అనుమానాల్ని వ్యక్తం చేస్తూ నెటిజనులు నిరంతరాయంగా మద్ధతు పలుకుతున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తును సీబీఐ సీరియస్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంక్ ఖాతాల్లో డబ్బు మిస్సవ్వడం.. ప్రియురాలు రియా చక్రవర్తిపై సందేహాల్ని రేకెత్తిస్తున్నాయి. బ్యాంక్ ఆర్థిక లావాదేవీల అవకతవకలపై ప్రస్తుతం ఈడీ విచారణ జరుగుతోంది.

ఇదే సమయంలో ఈ కేసులో రకరకాల కోణాలు బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న సుశాంత్ కి కుటుంబీకులతో సరైన సత్సంబంధాలు లేవంటూ రియా చక్రవర్తి ప్రత్యారోపణలు చేయడం కలకలం రేపింది. సుశాంత్ తన సోదరితో గొడవ పడేవాడని తిట్టేవాడని కూడా రియా వాట్సాప్ చాట్లను స్క్రీన్ షాట్స్ ద్వారా బయటపెట్టింది. సుశాంత్ సింగ్ తండ్రి అనవసరంగా తమపై కేసులు పెట్టారని రియా అంటున్నారు.

తాజాగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఆరోపణలు ఇంచుమించు అలానే ఉన్నాయి. అసలు సుశాంత్ సింగ్ కి తన తండ్రి తో కూడా సత్సంబంధాలు లేవని ఆయన అంటున్నారు. “తండ్రిని కలిసేందుకు పాట్నాకు సుశాంత్ ఎన్నిసార్లు వెళ్లాడు? అతడికి తండ్రి అంటే ప్రేమ ఉందా? అంటూ ప్రశ్నించాడు.

ఇక సుశాంత్ ఆత్మహత్య చేసుకునేప్పటికి ముంబైలో ఓ అపార్ట్ మెంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఇదే చోట తన స్నేహితుడు సిద్ధాంత్ కూడా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ సింగ్ స్నేహితుని వాంగ్మూలం కీలకంగా మారింది. సుశాంత్ కుటుంబీకులు రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని తనను బలవంతం చేస్తున్నారని అతడు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంతకుముందు సుశాంత్ ముఖంపై గాయాలున్నాయని.. అతడి కాళ్లను విరిచి వెనక్కి కట్టేశారని పలువురు రాజకీయ నాయకులు ఆరోపించడంతో కేసు మరింత ఝఠిలంగా మారింది.