‘సుశాంత్ గంజాయి సిగరెట్స్ తాగేవాడు’

0

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని తలపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సుశాంత్ సూసైడ్ కేసుని విచారించిన పోలీసులు అతనిది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్ని తేల్చలేదు. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మరోవైపు జాతీయ మీడియా సుశాంత్ కేసుపై ఫోకస్ పెట్టి అనేక విషయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై పోలీసులకు సుశాంత్ ఇంట్లో పనిచేసిన నీరజ్ సింగ్ అనే వ్యక్తి ‘సుశాంత్ తరచుగా గంజాయి తీసుకునేవాడని’ సంచలన విషయం చెప్పినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కాగా మీడియా కథనం ప్రకారం సుశాంత్ రెగ్యులర్ గా గంజాయితో నింపిన సిగరెట్లను తాగేవాడని నీరజ్ సింగ్ వెల్లడించాడట. సుశాంత్ తన ఇంట్లోనే వారానికి రెండుసార్లు పార్టీ చేసుకునేవారని.. మద్యంతో పాటు గంజాయితో నింపిన సిగరెట్లను కూడా ఉపయోగించేవారని.. సుశాంత్ చనిపోవడానికి రెండు రోజుల ముందు నేను ఆయనకు గంజాయితో కూడిన సిగరెట్ పెట్టెలను ఇచ్చానని.. ఆయన మరణించిన తర్వాత చూస్తే ఖాళీ పెట్టెలు కనిపించాయని పోలీసులకు నీరజ్ సింగ్ చెప్పనట్లు కథనాలు వెలువడుతున్నాయి.

ఇప్పటి వరకు సుశాంత్ సింగ్ డిప్రెషన్ ట్రీట్మెంట్ తో తీసుకుంటున్నాడని.. దానికి సంబంధించిన మెడిసిన్ వాడుతున్నాడని వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా అతను గంజాయి తీసుకునే వాడని న్యూస్ రావడం మరిన్ని సందేహాలను రేకిత్తిస్తున్నాయి. మరోవైపు సుశాంత్ మరణానికి అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ దర్యాప్తుతో ఈ కేసులో వెలువడుతున్న విషయాలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.