నాని కోసం హైదరాబాద్ కు కలకత్తా కాళి

0

నాని 25వ సినిమా ‘వి’ విడుదలకు సిద్దం అయ్యింది. మరో మూడు రోజుల్లో ఆ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు నాని కొత్త సినిమా శ్యామ్ సింఘరాయ్ కూడా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా కథానుసారం ఎక్కువ కథ కలకత్తాలో జరుగబోతుంది. అది కూడా 20 ఏళ్ల క్రితం కలకత్తా పరిసరాల్లో జరగాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ షూటింగ్ జరపడం కష్టం. కనుక కాస్త ఇబ్బంది రిస్క్ తో కూడుకున్నది అయినా కూడా పాత కలకత్తా కాళిని మరియు పరిసర ప్రాంతాలను హైదరాబాద్ అల్యూమీనియం ఫ్యాక్టరీలో నిర్మించబోతున్నారు.

కరోనా కారణంగా సినిమాలన్నీ కూడా దాదాపుగా సెట్టింగ్స్ లో పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. శ్యామ్ సింఘరాయ్ సినిమాను కూడా మెజార్టీ పార్ట్ ఆ సెట్ లో చిత్రీకరించబోతున్నారట. గత వారం రోజులుగా అల్లూమీనియం ఫ్యాక్టరీలో షూటింగ్ కోసం సెట్టింగ్ నిర్మాణం జరుగుతోంది. వచ్చేనెల రెండవ లేదా మూడవ వారం నుండి అక్కడ చిత్రీకరణ జరుపుతారని తెలుస్తోంది. సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు.

ఈ సినిమాలో ఇద్దర హీరోయిన్స్ నటించబోతున్నారు. సాయి పల్లవి నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ట్యాక్సీవాలా వంటి విభిన్నమైన సినిమాను చేసిన రాహుల్ సంకీర్త్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది మరోసారి నాని నట విశ్వరూపం చూపించే విధంగా ఉంటుందని అంటున్నారు. సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ఒక మంచి పాత్రను పోషించడం ద్వారా కెరీర్ లో నిలిచి పోయే సినిమా అవుతుందని భావిస్తుందట.