వికారాబాద్ అడవుల్లో రకుల్ కి ఏం సీక్రెట్ పని?

0

క్రిష్ `ఆహా-తెలుగు` కోసం వెబ్ సిరీస్ కి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వెండితెర కోసం ఏం చేస్తున్నాడు? అంటే ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కంగనతో మణికర్ణిక కోసం పని చేశారు. ఇటీవల చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ హీరోగా ఒక జానపద కథాంశాన్ని `విరూపాక్ష` (వర్కింగ్ టైటిల్) పేరుతో సినిమాగా తీస్తున్నాడు. ఆ సినిమా చిత్రీకరణ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈలోగానే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ – రకుల్ ప్రీత్ జంటగా ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోందని సమాచారం. నిన్ననే కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగిపోవడంతో తను ముంబైకి హిందీ మూవీ కోసం వెళ్లి వస్తోందా? అంటూ చర్చ సాగింది.

ప్రస్తుతం సీక్రెట్ గా షూటింగ్ చేసేస్తున్నారట. రకుల్ నేరుగా విమానాశ్రయం దిగి వికారాబాద్ వెళ్లిందని తెలుస్తోంది. నిజాకి ఇటీవల షూటింగులు అంటేనే భయపడుతుంటే ఇలా క్రిష్ కానీ అతడి టీమ్ కానీ ఎలాంటి భయం లేకుండా చిత్రీకరణ కానిచ్చేస్తున్నారు. క్రిష్ ఏది ప్లాన్ చేసినా సంథింగ్ స్పెషల్ గానే ఉంటుంది. మరి కుర్రహీరోని ఎలా చూపిస్తాడో చూడాలి. ఇందుల్ రకుల్ పాత్ర ప్రాధాన్యత ఎంత? అన్నది వేచి చూడాలి. ప్రస్తుత సినిమా పూర్తయ్యాక విరూపాక్షను సెట్స్ కి తీసుకెళతారు. అంతవరకూ ఆ మూవీకి బ్రేక్ ఇచ్చినట్టేనట.