బాబాయితో ప్లాన్ చేస్తున్న అబ్బాయి

0

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. మొదట్లో తన సినిమాలను తానే నిర్మించుకుంటూ వచ్చిన కళ్యాణ్ రామ్ బయట సినిమాల నిర్మాణంపై దృష్టి పెట్టాడు. 2015లో మొదటి సారి ‘కిక్ 2’ సినిమాను నిర్మించిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత 2017లో తమ్మడు ఎన్టీఆర్ తో జైలవకుశ సినిమాను నిర్మించాడు. ఎన్టీఆర్ 30వ సినిమా నిర్మాణంలో కూడా కళ్యాణ్ రామ్ ఉన్నాడు. ఇదే సమయంలో బాబాయి బాలయ్య కోసం కూడా కళ్యాణ్ రామ్ ప్లాన్ చేస్తున్నాడట.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ బాబాయి బాలయ్య కోసం ఒక మాస్ మసాలా ను రెడీ చేయించాడట. త్వరలోనే బాలయ్యకు దాన్ని వినిపించడంతో పాటు దర్శకుడి విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. బాబాయితో సినిమా కోసం కళ్యాణ్ రామ్ గత రెండు మూడు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే కథ విషయంలో కుదరక పోవడంతో ఇన్ని రోజులు ఎన్టీఆర్ ఆర్ట్స్ లో బాలయ్య సినిమా చేయలేదు.

ఇప్పుడు బాబాయి తగ్గ కథను కళ్యాణ్ రామ్ పట్టాడు కనుక ఖచ్చితంగా వీరిద్దరి కాంబోలో మూవీ వస్తుందనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఒకే సారి తమ్ముడు ఎన్టీఆర్ తో మరియు బాబాయి బాలయ్యతో సినిమాలను నిర్మించి కళ్యాణ్ రామ్ నందమూరి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తాడేమో చూడాలి. ప్రస్తుతం బాలయ్య బోయపాటి సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ బ్యానర్ లో నటించేందుకు ఓకే చెప్తాడేమో చూడాలి.