బస్సులో 45 మంది ఉన్నా.. ఆమెను రేప్ చేశాడు!

0

దారుణం ఘటన ఒకటి చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో.. 45 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ.. ఒక యువతిపై అత్యాచారం జరిగిన వైనం సంచలనంగా మారింది. ఈ ఉదంతం ఇప్పుడు కొత్త సందేహాలకు తెర తీసేలా మారింది. ఈ ఉదంతంలో ఢిల్లీకి చెందిన యువతి బాధితురాలిగా నిలిచారు. కదులుతున్న బస్సులో.. అంతమంది ప్రయాణికులు ఉన్న వేళలో అత్యాచారం ఎలా జరిగిందన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

నేరం జరిగిన తీరు చూస్తే.. నోట మాట రాదంతే. ఢిల్లీకి చెందిన బాధితురాలు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నుంచి దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. ఆమె తన ప్రయాణానికి బస్సులో టికెట్ బుక్ చేసుకున్నారు. బస్సు స్లీపర్ కావటంతో ఆమె పడుకున్నాడు. అయితే.. ఆమె బెర్తులో పడుకొని ఉండగా.. బస్సుక్లీనర్ రవి గుప్తా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఉన్నట్లుండి పెద్దగా కేకలు.. అరుపులు వినిపించాయి. ఆ సమయంలో బస్సును రెండో డ్రైవర్ నడుపుతున్నాడు. మొదటి డ్రైవర్ ఉలిక్కిపడి లేచి.. బస్సులోపలకు వెళ్లగా.. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై భోరుమంది. దీంతో.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను గాఢ నిద్రలో ఉన్న సమయంలోక్లీనిర్ రవి గుప్తా తన వద్దకు వచ్చి.. తనను అత్యాచారం చేశాడని.. బట్టలు చించేసినట్లుగా పేర్కొన్నారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రయాణికులు అంతమంది ఉన్నా.. అత్యాచారం జరగటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రయాణికులంతా మాంచి నిద్రలో ఉండటం.. బస్సు స్లీపర్ సీటింగ్ కావటంతో ఇలాంటి దారుణానికి కారణమైందని భావిస్తున్నారు.