వామ్మో తాప్సీ.. తొమ్మిదిలోనే లవ్వాయణం

0

తాప్సీ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని పేరిది. మంచు వారబ్బాయి మనోజ్ నటించిన `ఝమ్మందినాదం` సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో స్టార్స్ పక్కన నటించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాలీవుడ్ కు మకాం మార్చేసి ఊహించని స్థాయిలో అక్కడ బిజీ అయిపోయింది.

లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ తో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు తాప్సీ బాలీవుడ్ లో కెరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్న తాప్సీ తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు సంచలన విషయాల్ని బయటపెట్టింది. తొమ్మిదవ తరగతిలోనే ఈ అమ్మడు ప్రేమలో పడిందట. ఓ అబ్బాయిని అమితంగా ఇష్టపడ్డానని.. అతను కూడా తనని ప్రేమించాడని అయితే చదువుపై దృష్టిపెట్టాలనే ఉద్దేశ్యంతో అతను తనతో మాట్లాడటం మానేశాడట. దాంతో పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి అతగాడికి ఫోన్ చేసి బోరున ఏడ్చేసిందట తాప్సీ.

అది తన ఫస్ట్ క్రష్ అని తన జీవితంలో ఓ బెస్ట్ మెమొరీగా నిలిచిపోయిందని చెప్పుకొచ్చింది. దీంతో తాప్సీ సమాధానం విన్న నెటిజన్స్ షాకవుతున్నారు. వామ్మో ..తాప్సీ తొమ్మిదిలోనే అలా చేసిందా అంటూ అవాక్కవుతున్నారు. తాప్సీ ఇటీవల మాల్దీవ్స్ కి వెకేష న్ కి వెళ్లి అక్కడ తన ప్రియుడితో ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.