మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా బర్త్ డే సందర్భంగా నేడు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తమన్నా మొదటి తెలుగు వెబ్ సిరీస్ లెవెంథ్ అవర్ (11వ గంట) OTT ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల టైటిల్ లోగో వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అప్పటి లాంచ్ కార్యక్రమంలో తమన్నా- దర్శకుడు ప్రవీణ సత్తారు- రచయిత-నిర్మాత ప్రదీప్ యు- ఆహా ప్రమోటర్ అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఉపేంద్ర నంబూరి రాసిన 8 గంటలు నవల స్ఫూర్తితో రూపొందుతున్న వెబ్ సిరీస్ ఇది. ప్రవీణ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు.
తమిళ సిరీస్ `నవంబర్ స్టోరీ`తో OTT అరంగేట్రం చేసిన తరువాత ఇది తమన్నా కు రెండవ వెబ్ సిరీస్. తాజాగా లెవెంథ్ అవర్ కొత్త పోస్టర్ రిలీజైంది. తమన్నా ఇలా ఫైల్స్ ముందేసుకుని ఏదో ఆలోచిస్తూ కనిపిస్తోంది. స్పోర్ట్ లుక్ తో సింపుల్ గా కనిపిస్తోంది. తమన్నా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇది. ఇక ఇదేగాక.. గోపిచంద్ – తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ డ్రామా సిటీమార్ రిలీజ్ కి రావాల్సి ఉంది.