తమన్నా శీతాకాలం ఆగిపోలేదు

0

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా యంగ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా ఇటీవలే మొదలైన మూవీ ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న లవ్ మోక్ టైల్ కు ఇది అధికారిక రీమేక్ అనే విషయం తెల్సిందే. షూటింగ్ లాంచనంగా ప్రారంభం అయిన కొన్ని రోజుల్లోనే సినిమా బడ్జెట్ ఇష్యూల కారణంగా ఆగిపోయింది అంటూ సినీ వర్గాల్లో ప్రచారం మొదలు అయ్యింది. సత్యదేవ్ మరియు తమన్నా కాంబోకు ఉన్న క్రేజ్ కు బడ్జెట్ కు సెట్ అవ్వక పోవడం వల్ల సినిమాను ఆపేశారనే పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆ పుకార్లు నిజం కాదంటూ హీరో సత్యదేవ్ క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఆగిపోలేదు అంటూ స్పష్టంగా చెప్పేశాడు.

సత్యదేవ్ ఈ విషయమై క్లారిటీ ఇస్తూ సినిమా షూటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమా క్యాన్సిల్ అయ్యిందనే వార్తల్లో నిజం లేదు. దర్శక నిర్మాత నాగశేఖర్ ప్రస్తుతం షూటింగ్ ఏర్పాట్లలో ఉన్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ మొదలు అవుతుందని హీరో పేర్కొన్నాడు. దాంతో గత రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది.

స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన తమన్నా ఈమద్య కాస్త డల్ అయ్యింది. అయినా కూడా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది అనడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో సినిమా ఆగిపోయింది అనడంతో ఆమె అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. మళ్లీ హీరో సత్యదేవ్ ప్రకటనతో తమన్నా అభిమానులు కాస్త ఊరట చెందుతున్నారు.