రంగుల ప్రపంచంలో గ్లామర్ వలలో

0

ఒకప్పుడు వెండితెరపై గ్లామర్ ని ఆరబోయాలంటే బాలీవుడ్ నుంచో లేకపోతే విదేశీ భామల కోసమో మన దర్శకనిర్మాతలు వెంపర్లాడేవారు. కానీ ట్రెండ్ మారింది. సినిమా తీరు మారింది. వ్యాంప్ క్యారెక్టర్ లకు మాత్రమే ఓవర్ డోస్ గ్లామర్ ని ఒలికించే అవకాశాలు వుండేవి. ఐటమ్ పాపలు అంటూ ప్రత్యేకంగా శృంగార తారల్ని వెతికి పట్టుకునేవారు. అదీ కాలక్రమేనా మారింది.

ఇటీవల హీరోయిన్ లే ఐటమ్ సాంగ్ లకు ఎగబడుతున్నారు. ఎంత కావాలంటే అంత అందాల విందు చేయడానికి రెడీ అవుతున్నారు. గ్లామర్ పాత్రలంటే బాలీవుడ్ భామలనే ఓ బోర్డర్ వుండేది. కానీ ఈ మధ్య అది కూడా చెరిగిపోయింది అనడం కంటే మన వాళ్లే చెరిపేశారు. ఉత్తరాది వారి కంటే మనం ఎందులో తక్కువ కాదనేట్టుగా మన తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ ని ఒలకబోయడానికి సిద్ధపడుతున్నారు. అందుకు నో రిస్ట్రిక్షన్స్ అంటూ షాకిస్తున్నారు.

ఈ వరుసలో ముందు నిలుస్తున్న లిస్ట్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. గ్లామర్ డోస్ విషయంలో ఏమాత్రం తగ్గని అరడజను మంది తెలుగమ్మాయిలున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. `గూఢచారి` గాళ్ శోభిత ధూళిపాల మన తెలుగమ్మాయే. తెనాలమ్మాయ్ గా సుపరిచితం. ముందు బాలీవుడ్ లో ప్రయత్నించి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ అమ్మడికి అందాల ఆరబోతలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. మన తెలుగమ్మాయేలా ఇలా గ్లామర్ షో చేస్తోంది అని అవాక్కయ్యేలా శోభిత గ్లామర్ షో చేస్తే చెలరేగిపోతోంది. అయితే అందాల పోటీలు ర్యాంప్ షోలతో టాప్ లేపిన శోభితకు ఇది చాలా చిన్న విషయమే సుమీ.

ఈ మధ్య వరంగల్ చిన్నది ఈషా రెబ్బ కూడా తానూ ఎందులో తక్కువ కాదంటూ రెచ్చిపోతోంది. `లస్ట్ స్టోరీస్` రీమేక్లో ఈషా చేసిన రచ్చ అంతా ఇంతా కాదంటున్నారు. ఇక బిగ్ బాస్- తెలుగు ఫేమ్ నందిని రాయ్ కూడా మన తెలుగమ్మాయే. పక్కా హైదరాబాదీ. సినిమాల్లో పెద్దగా రాణించలేకపోతున్నా వెబ్ సిరీస్లలో మాత్రం రెచ్చిపోతోంది. లోదుస్తుల్లోనూ ఫొటోలకి పోజులిస్తూ రెచ్చగొట్టేస్తోంది. తేజస్వి మాది వాడ కూడా ఈ తరహాలోనే బిగ్ బాస్ లో పాపులరై సోషల్ మీడియాల్లో చెలరేగుతున్నారు. అనంతపురం అమ్మాయి ట్యాక్సీవాలా చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక జవాల్కర్ డేరింగ్ అండ్ డాషింగ్ షో గురించి ఆసక్తికర చర్చ సాగింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ -తెలుగు షోలో అవకాశాలు అందుకున్న పలువురు భామలు ఇటీవల గ్లామర్ షోకి ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. నిరంతర సోషల్ మీడియా ఫోటోషూట్లతో అభిమానుల్ని పెంచుకుంటున్నారు. ఇలా అవకాశాల కోసం చెలరేగిపోతున్న మన తెలుగమ్మాయిల లిస్ట్ ఇంకా పెరిగే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రంగుల ప్రపంచంలో గ్లామర్ వలలతోనే అవకాశాలు దక్కేంది. ఈ విషయాన్ని తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే వంట పట్టించుకుంటున్నారని అనుకోవచ్చేమో!