గంగవ్వను ఒంటరిని చేశారా.. ఫ్యాన్స్లో టెన్షన్

0

భారీ అంచనాలతో మొదలైన బిగ్బాస్ హౌస్ ప్రస్తుతం డీలా పడిపోయింది. వినోదం లేక ప్రేక్షకులకు రోజురోజుకూ ఆసక్తి తగ్గిపోయింది. అయితే హౌస్లోకి అడుగుపెట్టిన గంగవ్వ మాత్రం ఈ షోకు ప్రత్యేకంగా నిలిచిపోయింది. సోషల్మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటివరకు మేము బిగ్బాస్ షో చూడలేదు కానీ.. ఇప్పడు గంగవ్వకు ఓట్లేస్తాం అంటూ సోషల్మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే ఆమె రేంజ్ తెలుసుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన బిగ్బాస్ ఇంటి సభ్యులు ఆమెను టార్గెట్ చేశారేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో గంగవ్వ హౌస్లో ఉండలేకపోతోంది. పైకి అందరూ గంగవ్వతో బాగానే ఉన్నట్టు నటిస్తున్నప్పటికీ ఆమెను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. గంగవ్వను ఎలాగైనా బయటకు పంపించాలని కొందరు సభ్యులు ఆలోచిస్తున్నారట. ఆమెకు బయట ఫుల్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఎన్నిసార్లు నామినేట్ చేసినా సేవ్ అవుతోంది.. కాబట్టి హౌస్లో ఒంటరిని చేస్తే గతంలో సంపూర్ణేష్బాబు పోయినట్టు ఆమె వెళ్లిపోతుందని కొందరు కుట్రలు చేశారట.

ఆమె ఆటిడ్యూడే ఫిదా చేసింది
కల్లాకపటం లేని నిర్మల మనసుతో మై విలేజ్ షోతో అభిమానులను సొంతం చేసుకున్న గంగవ్వకు బిగ్బాస్ హౌస్కు వెళ్లాక కూడా ఆదరణ తగ్గలేదు. మిగతా సభ్యుల్లాగా నటించకుండా షోలో ఆమె చాలా సహజంగా ఉండటం కూడా ఎంతోమందికి నచ్చింది. అయితే గంగవ్వ మాత్రం అక్కడ కుదురుకోలేకపోతోంది. అందుకే ఎలిమినేషన్స్ ప్రక్రియలో ప్రతీ సారి తనే ముందుడుగు వేస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. నా వల్ల కాదు బిడ్డ నేను పోతా.. అంటూ పలుమార్లు తన ఆలోచనను బయటపెడుతోంది. గతంలో సంపూర్ణేష్ బాబు కూడా ఇలాగే ప్రవర్తించాడు. బిగ్బాస్తో గొడవపెట్టుకొని మరి ఇంట్లోనుంచి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం గంగవ్వ కూడా అలాగే వస్తుందేమో వేచి చూడాలి.

గంగవ్వపోతే.. బిగ్బాస్ చూసేవాళ్లే ఉండరా!
మొత్తం ఓట్లలో గంగవ్వకే 40 శాతం వస్తున్నాయంటే ఆమెకు ఏరేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఊహించుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి బిగ్బాస్ వంటి షోలపై ఆసక్తి ఉండదు. ప్రస్తుతం గంగవ్వ ఉండటం వల్ల పల్లెటూర్లలో ఈ షోను చాలామంది చూస్తున్నారు. కానీ గంగవ్వ వెళ్లిపోతే బిగ్బాస్కు టీఆర్పీ పడిపోవడం ఖాయం. అందుకే బిగ్ బాస్ ఇప్పట్లో ఆమెను పంపేలా లేడని సమాచారం. అయితే గంగవ్వ షో చివరివరకు ఉండదని మరొక టాక్ వస్తోంది. గంగవ్వ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.