Templates by BIGtheme NET
Home >> Cinema News >> థమన్.. లక్కీ ఛాన్స్ పోయినట్లే?

థమన్.. లక్కీ ఛాన్స్ పోయినట్లే?


సౌత్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న టాలెంటెడ్ మ్యూజిషియాన్ థమన్. ఎన్నో కమర్షియల్ సినిమాల సక్సెస్ లో భాగమైన థమన్ నుంచి గత కొంతకాలం నుంచి స్ట్రాంగ్ గా ఇంపాక్ట్ క్రియేట్ చేసే సాంగ్స్, మ్యూజిక్ రావడం లేదనే మాట వినిపిస్తోంది. గతంలో థమన్ మీద ఎక్కడో బీట్స్ ని కాపీ చేసేసి వాడేస్తూ ఉంటాడనే విమర్శలు ఉన్న వాటికీ గట్టిగా సమాధానం చెబుతూ వచ్చేవాడు.

తన సంగీతంతోనే అన్నింటికి సమాధానాలు చెబుతూ స్టార్ హీరోలని మెప్పించి అవకాశాలు సొంతం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఈ మధ్య అతని మ్యూజిక్ మరీ బ్యాడ్ గా ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ అంత ఇంప్రెసివ్ గా లేవు.

అలాగే స్కంద మ్యూజిక్ మీద కూడా విమర్శలు వచ్చాయి. చేతినిండా అవకాశాలు అయితే ఉన్నాయి. కాని ఈ ఏడాది థమన్ నుంచి ట్రెండ్ అయ్యే సాంగ్ ఒక్కటి కూడా రాలేదు. సోసోగానే అన్ని సాంగ్స్ ఉన్నాయి. సినిమాలకి కూడా సాంగ్స్ తో పెద్దగా కలిసొచ్చింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మంచి అవకాశాన్ని మిస్ చేసుకునే పరిస్థితి వస్తోందనే మాట వినిపిస్తోంది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజా డీలాక్స్ సినిమాకి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని మారుతి అనుకున్నారంట. రాధేశ్యామ్ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ థమన్ అందించారు. దానికి ఇంప్రెస్ అయిన ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చారంట. అయితే గుంటూరు కారం సినిమా సాంగ్స్ పై మహేష్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.

దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ కూడా థమన్ సంగీతం వద్దని రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఈ తరహా సాంగ్స్, మ్యూజిక్ ఉంటే సినిమాపై ఇంపాక్ట్ పడుతుందని వద్దంటున్నారంట. మారుతి కూడా మ్యూజిక్ విషయంలో పునరాలోచనలో పడ్డాడనే మాట వినిపిస్తోంది. థమన్ కాకుండా ప్రత్యామ్నాయం వెతుకుతున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాలలో నడుస్తోంది.