`కంచె` వేయని కన్నె అందం

0

`కంచె` సినిమాలో ఎంతో సాంప్రదాయబద్ధంగా కంచి పట్టు కనకమ్మలా కనిపించింది ప్రగ్య జైశ్వాల్. అరెరే.. ఇదేమిటో మరీ ఇంత సాంప్రదాయ బద్ధంగా మెరిసిపోతోంది ఈ ముంబై బొమ్మ! అంటూ షాక్ తిన్నారు యూత్. వరుణ్ తేజ్ సరసన ఎంతో బుద్ధిమంతురాలైన ప్రేమికురాలిగా కనిపించింది. ఆ సినిమాలో కనిపించిన తీరుకి ఆ తర్వాత వేరే సినిమాల్లో కనిపించిన తీరుకి అసలు పొంతన అన్నదే లేకుండా పోయింది. మంచు హీరో సినిమాలో అయితే ఈ అమ్మడి అందాల ఆరబోతకు ముచ్చమటలే పట్టాయి.

ఇక ఇటీవల సోషల్ మీడియాల్లో ప్రగ్య జైశ్వాల్ వీరంగం మామూలుగా లేదు. రెగ్యులర్ గా స్పోర్ట్ లుక్ తో ప్రగ్య ఊహించని సర్ ప్రైజ్ ట్రీట్ నే ఇస్తోంది. రెగ్యులర్ జిమ్ వీడియోలు ఫోటోలు .. యోగా ఫీట్స్ తో బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో హీట్ పెంచుతున్న ఈ భామ తాజాగా థై షోస్ తో అగ్గి రాజేసింది.

టాప్ లో వైట్ టీస్ ధరించి థైషోస్ తో మెంటలెక్కించిందనే చెప్పాలి. అందాల ఆరబోతకు కంచె వేయలేరెవరూ? అని ప్రూవ్ చేస్తోంది ఈ ముంబై బ్యూటీ. అమ్మడి డిజైనర్ లుక్ చూశాక అయినా అవకాశాలిచ్చే వారే కరువయ్యారు. కనీసం ఈ హార్డ్ వర్క్ పట్టుదల చూసి అయినా టీటౌన్ లో ఛాన్సులిస్తారేమో చూడాలి.