తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ జాబితా!

0

తెలుగు బిగ్బాస్ సీజన్ 4 నేటి నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే. మొదటి మూడు సీజన్ లు సూపర్ హిట్ అవ్వడంతో ఈసీజన్ కు అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంలో ఇప్పటి వరకు అనేక పుకార్లు షికార్లు చేశాయి. పలువురు తాము షోలో కంటెస్టెంట్స్ కాదంటూ క్లారిటీ ఇవ్వగా మరికొందరు మాత్రం ఆ విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కనుక వారు షో లో ఉంటారేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఈ సమయంలో షో కు సంబంధిత తుది జాబిత మరోసారి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

మొదటి నుండి ప్రచారం జరుగుతున్నట్లుగా నోయెల్.. దేత్తడి హారిక.. గంగవ్వ.. అమ్మ రాజశేఖర్.. కరాటే కళ్యాణి.. సోహెల్.. ముక్కు అవినాష్.. దిల్ సే మెహబూబా.. విష్ణుప్రియ.. అరియానా.. సుజాత… మోనాల్.. అభిజిత్..తనూజలతో పాటు మరో ముగ్గరు నలుగురు కూడా ఇందులో ఉండబోతున్నారు. నేడు సాయంత్రం టెలికాస్ట్ కాబోతున్న ఈ షో కు సంబంధించి ఇప్పటికే షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

షో ప్రత్యేక గెస్ట్లుగా పున్ను మరియు రాహుల్ లు కనిపించబోతున్నారు. నాగార్జున హోస్టింగ్ తో మరోసారి అదరగొట్టడం ఖాయం అంటూ అభిమానులు ఎంతో నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. గత సీజన్ లో అనూహ్యంగా విజేత అయిన రాహుల్ సిప్లిగంజ్ ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా రాబోతున్న నేపథ్యంలో రేటింగ్ ఖచ్చితంగా బాగా వచ్చే అవకాశం ఉందంటున్నారు.