ముంబై ఎవరి బాబు గారి ఆస్తి? కంగనకు మద్ధతు..!

0

కంగన వర్సెస్ శివసేన నాయకుడు సంజయ్ రౌత్ వివాదం గురించి తెలిసిందే. ఆ ఇద్దరి గొడవా ముంబైకి చిక్కులు తెచ్చి పెడుతోంది. మాటా మాటా పెరిగి అది ఆన్ లైన్ రచ్చగా మారింది. ఈ గొడవలోకి ఇతర పార్టీల నేతలు ఒక్కొక్కరుగా దిగుతున్నారు. ఇక శివసేన వ్యతిరేకులంతా ఒక తాటిపైకి వచ్చి కంగనకు మద్ధతు పలుకుతున్నారు.

శివసేన నాయకుడు సంజయ్ రౌత్ .. అసలు ముంబైకి రావొద్దని నన్ను హెచ్చరిస్తున్నారని కంగన ఆరోపించారు. అదేమైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనుకుంటున్నాడా? అంటూ కంగన ఫైరైన సంగతి విధితమే. అయితే క్వీన్ కి నైతిక మద్ధతుగా హరియాణా హోం మంత్రి అనీల్ విజ్ నిలిచారు.

ఇది (ముంబై) ఎవరైనా బాబు గారి (తండ్రి) ఆస్తినా? ముంబై భారతదేశంలో ఒక భాగం. ఎవరైనా అక్కడికి వెళ్ళవచ్చు.. పోవచ్చు.. ఇలాంటి ప్రకటనలు జారీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. మీరు ఎవరైనా నిజం మాట్లాడకుండా ఆపలేరు అంటూ హోం మంత్రి అనీల్ విజ్ ఎవరి పేరును పెట్టకుండా కామెంట్లు చేసారు. ఇది కంగనకు భేషరతుగా మద్ధతునివ్వడమే.

కంగన ఏం మాట్లాడినా స్వేచ్ఛగా వెల్లడించడానికి అనుమతించాలి అని విజ్ అన్నారు. ఆమెకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. `ముంబై ఒక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లాంటిది` అన్న కంగన వ్యాఖ్యకు ముంబై జనం మరిగిపోతున్న సంగతి తెలిసిందే. నగరంలోకి అడుగు పెడితే కొడతామని సోషల్ మీడియాల్లో హెచ్చరించారు. శివసైనికులు అయితే చెలరేగిపోతున్నారు.

“ప్రతి సమస్యపైనా రోడ్డుపైకి వచ్చే ఒక కొవ్వొత్తి ఆమె (కంగన). తను మాట్లాడటం మానేసినప్పుడు వారు తమ పతకాలను ఎందుకు తిరిగి ఇవ్వడం లేదు? అని మంత్రి గారు ప్రశ్నించారు. మొత్తానికి శివసేన వర్సెస్ హరియాణా మంత్రి ఎపిసోడ్ చూస్తుంటే కంగనకు మద్ధతు అంతకంతకు పెరుగుతోందనే దీనర్థం.