ది లస్ట్ ట్రైలర్

0

రామ్ గోపాల్ వర్మ చేసిన నేక్ డ్ (నగ్నం)తో హీరోయిన్ గా పరిచయమైన కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీ రాపాక. తొలి వెబ్ డ్రామాతో సంచలనం సృష్టించిన శ్రీ ప్రస్తుతం మరో వెబ్ థ్రిల్లర్ తో ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతోంది. శ్రీ రాపాక నటిస్తున్న వెబ్ థ్రిల్లర్ `ద లస్ట్ ఎ మర్డర్ మిస్టరీ`. థర్డ్ ఐ మూవీస్ ఈ సిరీస్ ని నిర్మిస్తోంది. ఎస్ కె ఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ షిండే నిర్మిస్తున్నారు.

పేరుకు తగ్గట్టే ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్స్ నేపథ్యంలో ఈ వెబ్ థ్రిల్లర్ సాగనుంది. లస్ట్ కూడా ఇంత వరకు తెలుగు వెబ్ సిరీస్ లలో కనిపించని స్థాయిలో లస్ట్ సన్నివేశాల్ని దర్శకుడు ఇందులో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వివాహేతర సంబంధాలతో ఈ వెబ్ డ్రామా సాగుతుంది. ఈ వెబ్ మూవీ ట్రైలర్ ని బుధవారం రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం శ్రీరాపాక రొమాన్స్ ఎపిసోడ్స్ సెగలు పుట్టించాయి. ఒక రకంగా శృంగారతార షకీలా రేంజులోనే ఈ మూవీలో హీటెక్కించే సీన్లను తీర్చిదిద్దడం అవాక్కయ్యేలా చేస్తోంది. ట్రైలర్ ప్రస్తుతం యూత్ ని షేక్ చేస్తోంది.

అమిత్… ఛత్రపతి శేఖర్… శ్రీ గగన్… ఆనంద్ భారతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ రాపాక మళ్లీ ఈ వెబ్ డ్రామాతో రచ్చ చేసేలా కనిపిస్తోంది. ట్రైలర్లోని కొన్ని సన్నివేశాల్లో శ్రీ రాపాక ఎలాంటి బెరుకు లేకుండా ఇంటిమేట్ సిన్లలో రెచ్చిపోయింది. కామం మిమ్మల్ని లొంగదీసుకున్నప్పుడు మీరు హద్దులు దాటేస్తారనే అర్థం వచ్చేలా ట్రైలర్లో కనిపిస్తున్న క్యాప్షన్స్ హద్దులు దాటే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ వెబ్ మూవీని త్వరలో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు.