అందాలతో సెగలు రేపుతున్న స్టార్ హీరో తనయ!!

0

తెలుగులో అరుదుగా జరిగేవి బాలీవుడ్ ఇండస్ట్రీలో రెగ్యులర్ గా జరుగుతుంటాయి. అందులో ఒకటి స్టార్ హీరోల కూతుర్లు హీరోయిన్స్ అవడం. ఏ ఇండస్ట్రీలో కనిపించనంత మంది బాలీవుడ్ లో కూతుర్లు హీరోయిన్స్ అయిపోతున్నారు. అక్కడ కూతుర్లే బాలీవుడ్ రాజ్యాన్ని ఏలుతున్నారు. తెలుగులో హీరోల వారసులు ఎలాగైతే ఉన్నారో.. అక్కడ హీరోయిన్లు కూడా ఇండస్ట్రీలో నిండిపోయారు. బయటి వాళ్లను పక్కన పెడితే బాలీవుడ్ నిండా చాలామంది హీరోయిన్లు.. స్టార్ హీరోలు నిర్మాతల కూతుళ్లే. కరీనా కపూర్ అలియాభట్ శ్రద్ధాకపూర్ సోనాక్షి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్.. సారా అలీఖాన్.. ఇలా చెప్తే పెద్ద లిస్టే ఉంది. ఇక ఇప్పుడు షారుక్ ఖాన్ కూతురు సుహానా వంతు త్వరలోనే రానుందట. ఈ 19యేళ్ళ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కాకముందే తన అందాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది.

ఎప్పుడు కెమెరా కంట్లో పడినా గ్లామర్ డాల్ గానే మెరుస్తుంది. కింగ్ ఖానే తన కూతురు గ్లామర్ షోను ఎంకరేజ్ చేయడం విశేషం. ఇక సుహానాకు గ్లామర్ గురువు అమ్మ గౌరీఖానే. ఆమె ఇంకా తన కూతురును అందంగా ముస్తాబు చేస్తుంది. హీరోయిన్ గా ఆరంగేట్రం చేయకపోయినా సుహానా ఖాన్ తన స్టైలిష్ లుక్తో ట్రెండీ ఫ్యాషన్తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెహంగాలో కుర్రకారుకి మతులు పోగొడుతుంది. ఎంతలా అంటే.. చూస్తే ఎలాంటి వాడైనా కళ్లప్పగించి చూడాల్సిందే. నిజానికి టాప్ టు బాటమ్ అమ్మడు సోయగాలను దర్శించుకోవడానికి వీలుగా పోజిచ్చింది. ఇక ఈ భామ అందాలు ఎప్పుడెప్పుడు వెండితెరపై చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఫోటో షూట్స్ తో ఫాలోయర్స్ ను తన అందాల గుప్పిట్లో ఉంచుకుంది. ప్రస్తుతం సుహానా న్యూయార్క్లోని ఫిల్మ్ మేకింగ్ కోర్సులో శిక్షణ తీసుకుంటోంది. చూడాలి మరి త్వరలో సినీ ఎంట్రీ ఇవ్వనుందేమో..!