Templates by BIGtheme NET
Home >> Cinema News >> యువ హీరో రెండో పెళ్లిపై గుసగుసలు

యువ హీరో రెండో పెళ్లిపై గుసగుసలు


భార్యతో మనస్ఫర్థల వల్ల కెరీర్ పరంగానూ డిస్ట్రబ్ అయిన ఓ యువహీరో ఇప్పుడిప్పుడే తిరిగి సొంత బ్యానర్ సినిమాలతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ సమయంలోనే అతడు తన లైఫ్ లో మరో శుభకార్యానికి శ్రీకారం చుడుతున్నారని తెలిసింది.

త్వరలోనే సదరు యువహీరో రెండో వివాహం చేసుకోనున్నారని .. తన కుటుంబానికి అత్యంత దగ్గర అమ్మాయినే పెళ్లాడుతున్నారని తెలిసింది. అయితే ఈ పెళ్లి వ్యవహారాన్ని కాస్తంత గోప్యంగానే ఉంచింది ఆ కుటుంబం. లో కీ ఎఫైర్ గా ఈ వేడుకను కానిచ్చేస్తుండడంతో అంతగా మీడియాలోనూ దీనిపై చర్చ సాగడం లేదు.

మే నెలలో ఈ వివాహాం జరగనున్నట్లు తాజాగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. 2020లో భార్య నుంచి విడిపోయిన ఆ యువహీరో ఇప్పుడిప్పుడే అన్నిటి నుంచి బయటపడుతున్నారు. సడెన్ గా విడాకులు.. అటుపై కెరీర్ ను వదిలేస్తున్నానని ప్రకటించిన ఆ యంగ్ హీరో అభిమానులకు బిగ్ షాకిచ్చారు. ఇటీవల సామాజిక అంశాలు సహా రాజకీయ వ్యవహారాల్ని ట్విట్టర్ లో టచ్ చేస్తున్న అతడు ఈ కొత్త విషయంపై ఇంకా ఏదీ వెల్లడించలేదు.

ఇక తొలి భార్య నుంచి విడిపోవడానికి కారణం ఆమె అమెరికా వెళ్లిపోయి అక్కడే సెటిలవ్వాలన్న నిర్ణయమేనని గుసగుసలు వినిపించాయి. సినీ రంగంలో బిజీ లైఫ్ ని సదరు భార్యామణి అర్థం చేసుకోలేకపోవడం స్పర్థలకు దారి తీసిందన్న చర్చా వేడెక్కించింది.