ఈ మద్య కాలంలో సామ్ ఏడ్చిన సందర్బం

0

చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కమర్షియల్ సినిమాల కంటే కాస్త కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది మంచి పరిణామం అంటూ అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అంతా అంటున్నారు. ఈ క్రమంలో ఆమె సినిమాల సంఖ్య తగ్గించడాన్ని మాత్రం అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జానుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఇప్పటి వరకు హీరోయిన్ గా కొత్త ప్రాజెక్ట్ ఏది కూడా ప్రారంభించలేదు. అయితే వచ్చే నెలలో ఈమె ది ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉండే సమంత మరోసారి అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్బంగా సమంత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మీరు ఒత్తిడిని ఎలా జయిస్తారంటూ ప్రశ్నించగా ధ్యానం చేయడంతో పాటు యోగాకు సమయం కేటాయిస్తాను అంది. మీకు వ్యవసాయంపై ఉన్న ఆసక్తి గమనిస్తున్నాం. మీరు వీకెండ్స్ లో నగర శివారుల్లో రైతులతో కలిసి వ్యవసాయం చేస్తే బాగుంటుంది కదా అంటూ అభిమాని ప్రశ్నించగా మీరు చెప్పిన ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది. థ్యాంక్యూ అర్చన. నేను దీని గురించి ఆలోచించాలనుకుంటున్నాను.

ఇక ఈ ఏడాది చివరి వరకు ఎలాంటి ప్లానింగ్ ను పెట్టుకోవడం లేదని ప్లాన్ లేకుండా ముందుకు వెళ్లడమే ప్లానింగ్ అంటూ సరదాగా సమాధానం ఇచ్చింది. ఇక ఈమద్య కాలంలో మీరు ఏడ్చిన సందర్బం ఏదైనా ఉందా అంటూ నెటిజన్ ప్రశ్నించగా.. ఈ ప్రశ్న అడిగినందుకు కృతజ్ఞతలు. ఈమద్య కాలంలో మా ఇంట్లో ఒకరికి రాషెస్ వచ్చాయి. ఆ సమయంలో నేను చాలా ఆందోళనపడి ఏడ్చేశాను అంది. అయితే ఎవరికి రాషెస్ అనే విషయంలో మాత్రం సమంత క్లారిటీ ఇవ్వలేదు.