చైతూ ‘థ్యాంక్యూ’ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

0

నాగచైతన్య.. విక్రమ్ కుమార్ ల కాంబోలో దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుంది. ఇప్పటికే ముగింపు దశకు వచ్చిన ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య ఈ సినిమాను చేయబోతున్నాడు. నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాగచైతన్య ఇంతకు ముందే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘మనం’ చిత్రం చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిత్రంపై కూడా అంచనాలు భారీగా ఉంటాయి.

విక్రమ్ కుమార్ సినిమాలన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. మనం.. 24… హలో ఇలా ప్రతి సినిమా విభిన్నమైన నేపథ్యంతో ఆయన తెరకెక్కిస్తూ ఉంటాడు. స్క్రీన్ ప్లే మాయ చేసి ఆయన ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాడు. నాగచైతన్య మూవీ కూడా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నాగచైతన్య మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడట.

మూడు గెటప్స్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చైతూ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయం ఏంటీ అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమాకు ఇప్పటికే ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. మరిన్ని వివరాలు షూటింగ్ ప్రారంభం అయ్యే సమయంకు వెళ్లడయ్యే అవకాశం ఉంది.