టిక్ టిక్ టిక్ సాంగ్ .. విరహ వేదనకు చెక్ పెట్టడమెలా?

0

అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే ఆపై విడివిడిగా ఉంటే ఆ విరహ వేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. విరహంలో కవిత్వం పుట్టుకొస్తుంది. ఇదిగో సరిగ్గా అలాంటి పోయెట్రీనే వినిపించారు ఈ పాటలో ఎంతో అందంగా ఆహ్లాదంగా ట్యూన్ కట్టి..

`సాక్షి` పత్రిక ఫీచర్స్ ఎడిటర్ చిత్రనిర్మాత ప్రియదర్శిని రామ్ `కేసు 99` ని రూపొందిస్తున్నారు. ఈ మూవీ నుండి టిక్ టిక్ టిక్ పాట లిరికల్ వీడియో విడుదలైంది. ఈ పాటను యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య ఆవిష్కరించారు. ప్రేమికులు విడిపోతే విరహవేదన ఎలా ఉంటుందో ఆవిష్కరించింది ఈ పాట.

ప్రేమ ప్రపంచం విడిపోయే ప్రపంచం వలె గందరగోళంగా ఉంది. పాటలోని బాధను అబ్బాయిలు అనుభవించవచ్చు. అమ్మాయిలకు ఇది అనుభవంలో తెలిసేదే. ట్యూన్ టోన్ రెండూ ఆహ్లాదకరంగా వినిపించాయి.

చాలా కాలం తరువాత జాజ్ శైలి ప్రేమ .. విరహం అనే భావనలను పాటలో వ్యక్తపరిచిన తీరు ఆసక్తిని కలిగించింది. మొబైల్ కాలింగ్ .. వాట్సాప్ చాటింగ్ తో పరిస్థితిని అందంగా చిత్రీకరించారు.

సంగీత దర్శకుడు ఆశిక్ అరుణ్ శ్రావ్యమైన ట్యూన్ అందించగా..ఇషాక్ వాలి గాత్రం మైమరిపించింది. ప్రియదర్శిని రామ్ సాహిత్యం బాలుడి బాధను స్పష్టంగా వర్ణిస్తుంది. కేస్ 99 చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.