అర్థరాత్రి 2 గంటల సమయంలో వరుణ్ తేజ్ బాక్సింగ్

0

కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నుండి షూటింగ్ లకు దూరం అయిన సినీ ప్రముఖులు పలువురు ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ లకు హాజరు అవుతున్నారు. సెప్టెంబర్ నుండి పలువురు హీరోలు షూటింగ్ లతో బిజీ అయ్యారు. ఎట్టకేలకు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఆగస్టు నుండే ఈ సినిమా షూటింగ్ గురించి వార్తలు వచ్చాయి. వైజాగ్ లో సినిమా షూటింగ్ కోసం వెళ్లబోతున్నారు అనే ప్రచారం జరిగింది. కాని ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలు అయ్యింది.

హైదరాబాద్ లోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈ సినిమా షూటింగ్ ను అర్థ రాత్రి సమయంలో నిర్వహిస్తున్న ఫొటోను వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. రాత్రి 2 గంటల సమయంలో షూటింగ్ నిర్వహించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ దాదాపు ఆరు నెలల పాటు బాక్సింగ్ లో అంతర్జాతీయ విజేతల వద్ద శిక్షణ తీసుకున్నాడు. ఈ షెడ్యూల్ ఈ నెల చివరి వరకు సాగుతుందని అంటున్నారు. వచ్చే నెలలో నిహారిక పెళ్లి ఉన్న కారణంగా బ్యాలన్స్ వర్క్ ను జనవరిలో పూర్తి చేస్తాడనే సమాచారం కూడా అందుతోంది.