మిస్ యు నాన్న నిన్ను కాపాడుకోలేక పోయాను అంటూ హీరోయిన్ ఎమోషనల్

0

సౌత్ లో సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతున్న రాయ్ లక్ష్మి బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఐటెం సాంగ్స్ తో ప్రత్యేక పాత్రలతో ఈమద్య కాలంలో కెరీర్ ను నెట్టుకు వస్తున్న రాయ్ లక్ష్మి ఇటీవల తన తండ్రిని కోల్పోయింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన ఆమె భావేద్వేగంకు గురి అయ్యింది. మిస్ యు నాన్న నిన్న కాపాడుకోలేక పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల చివరి శ్వాస విడిచారు.

నా జీవితంలో ఎన్నో ఇచ్చిన నువ్వు లేవు అనే విషయాన్ని నేను నమ్మలేక పోతున్నాను. మీరు లేరు అంటేనే నేను భరించలేకుండా ఉన్నాను. మీరు లేకున్నా కూడా నాకు మీ ఆశీర్వాదాలు ఉంటాయని నమ్ముతున్నాను. నిన్ను నేను కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మిమ్ములను కాపాడుకోలేక పోయాను. క్షమించండి నాన్న అంటూ ఆమె చేసిన సుదీర్ఘమైన భావోద్వేగ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది. రాయ్ లక్ష్మికి పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. మీ నాన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నామన్నారు.