నాగ్ బిగ్ బాస్ స్టైలిష్ లుక్ వెనుక ఉన్నది ఈమె

0

బిగ్ బాస్ హోస్ట్ అంటే సూటులో మాత్రమే కనిపించే వారు. కాని నాగార్జున ఆ మార్క్ ను చెరిపేశారు. వారం వారం సరికొత్త క్యాజువల్స్ తో స్టైలిష్ గా కనిపిస్తు వచ్చారు. తెలుగు బిగ్ బాస్ మొదటి రెండు సీజన్ లు కూడా ఎన్టీఆర్ మరియు నాగార్జునలు ఎక్కువగా సూటులో కనిపించారు. కాని నాగార్జున మాత్రం చూద్దాం అన్నా కూడా సూటులో కనిపించకుండా చాలా స్టైలిష్ ఔట్ ఫిట్ లో కనిపిస్తున్నారు. ఆయన ఆరు పదుల వయసు కాకుండా రెండు పదుల వయసు తగ్గి కనిపిస్తున్నారు. అప్పట్లో అమ్మాయిల మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున బిగ్ బాస్ స్టైలిష్ లుక్ తో ఈ తరం అమ్మాయిలకు కూడా నచ్చే విధంగా హోస్టింగ్ చేస్తున్నాడు.

నాగార్జున ఇంత స్టైలిష్ గా కనిపించడానికి కారణం ఫ్యాషన్ డిజైనర్ మనోజ్ఞ ఆవునూరి. ఈమె ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఈమె చిరంజీవి సైరా సినిమాకు కూడా వర్క్ చేశారు. చిరు కూతురు సుష్మితతో కలిసి ఈమె ఆ సినిమా స్టైలింగ్ వ్యవహారాలు చూసుకున్నారు. అంతకు ముందు ఆ తర్వాత కూడా చాలా సినిమాలకు మరియు షో లకు ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు.

నిజామాబాద్ కు చెందిన మనోజ్ఞ ముంబయిలోని నిఫ్ట్ లో మాస్టర్స్ ఇన్ డిజైనింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. దసరా రోజు ప్రత్యేక ఎపిసోడ్ కు సమంత హోస్ట్ గా వ్యవహరించింది. ఆ ఎపిసోడ్ లో సమంత కాస్ట్యూమ్స్ కలర్ ఫుల్ గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయంటూ కామెంట్స్ వచ్చాయి. ఆ రోజు ఎపిసోడ్ కు కూడా మనోజ్ఞ డిజైనర్ గా వ్యవహరించారు. సమంత మరియు నాగార్జునల కు సరిగ్గా సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ ను ఆమె డిజైన్ చేయడంతో ఆమె గురించి మరోసారి చర్చ జరుగుతోంది.