ఒంటిపై పచ్చబొట్లు ఉండే మన నాయికలు

0

పచ్చబొట్టు (టాట్టూ) చెరిగిపోదులే నా రాజా! అంటూ ఓ పాటను రీమిక్స్ కూడా చేశారు. నిజమే చెరిగిపోయేది పచ్చబొట్టు కాలేదుగా. పాశ్చాత్య దేశం నుంచి సౌత్ కి ఇంపోర్ట్ అయిన ఈ కల్చర్ కి మన కథానాయికలు ఈజీగా అడిక్ట్ అయిపోయారు. అలాంటి భామల్లో త్రిష ముందు వరుసలో ఉంటుంది. సమంత.. నయనతార.. శ్రుతిహాసన్.. అమలాపాల్.. రష్మిక తదితర నాయికలు ఉన్నారు.

సామ్ ఒంటిపై మూడు చోట్ల పచ్చబొట్లు ఉన్నాయి. ఇక అక్కినేని హీరో నాగార్జునకు పచ్చబొట్టు అంటే ఉండే క్రేజు గురించి చెప్పాల్సిన పనే లేదు. సామ్ పక్కటెముకలపై `చైతన్య` పేరును టాట్టూ వేయించుకుంది. చేయి.. వీపు భాగంలో టాట్టూలు ఉన్నాయి. నయనతారకు మెడపై మూడు టాట్టూలు.. ఎడమ చేతిపైనా టాట్టూ ఉంది. ఇంతకుముందు ప్రభుదేవాపై ప్రేమతో టాట్టూ వేయించుకుంది. కానీ అది చెరిగిపోకపోతే అక్కడ వేరే టాట్టూ రూపం షిఫ్ట్ చేయించిందని చెబుతారు.

ఎద భాగంపై త్రిష వేయించుకున్న టాట్టూ చాలా ప్రత్యేకమైనది. వీపుపై కెమెరా సింబల్ ను చేతి మణికట్టుపై లవ్ సింబల్ ను టాటూగా వేయించుకున్న నవలా నాయికగా పాపులరైంది. ఇక పూర్తిగా పాశ్చాత్య ధోరణుల్ని అమితంగా ఇష్టపడే శ్రుతిహాసన్ ఒంటిపై ఎన్ని పచ్చబొట్లు ఉన్నాయో చెప్పనలవి కానేకాదు. వీపుపై `శ్రుతి` అనే టాటూని తమిళంలో వేయించుకుంది. అలాగే ఆమె చెవి కింద మ్యూజిక్ సింబల్ టాటూ హైలైట్. `ఇర్రీప్లేసబుల్` (భర్తీ చేయలేనిది) టాటూతో రష్మిక మందన హీట్ పెంచింది.

అమలాపాల్ ది రెబల్ క్వీన్ తన ఫిలాసఫీకి తగ్గట్టుగా టాట్టూల్ని వేయించుకుంది. ఇటీవలే ఆమె చిత్రంలో నగ్నంగా నటించి సంచలనాలకు తావిచ్చిన ఈ బ్యూటీ టాట్టూల విషయంలో రాజీకి రానేరాదు. తన వీపుపై కాలిపై అమల పాల్ టాట్టూలు వేయించుకుంది. ఇక నేటితరం కుర్రభామల్లో టాట్టూలతో విరుచుకుపడే భామలెందరో.. తేజస్వి మాదివాడ.. శోభిత ధూళిపాల.. గీతామాధురి.. ఆండ్రియా జెరోమియా.. చిన్మయి… వీళ్లంతా టాట్టూలతో కనిపించడానికి ఇష్టపడతారు.