మా నాన్న చంపాలని చూస్తున్నారు: హీరోయిన్

0

తన తండ్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని.. తనను కాపాడాలంటూ హీరోయిన్ తృప్తి శంఖదార్ (19) సంచలన వీడియోను రిలీజ్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తల్లితో కలిసి తనను రక్షించాలంటూ వీడియోను పోస్టు చేసింది. ఇదిప్పుడు వైరల్ అయ్యింది.

తన తండ్రి రామ్ రతన్ శంఖదార్ తో తనకు ప్రాణ హాని ఉందని ఆ వీడియోలో హీరోయిన్ తృప్తి శంఖదార్ వాపోయింది. రామ్ రతన్ తనకు ఇష్టం లేని అబ్బాయితో పెళ్లి చేయాలని చూస్తున్నాడని.. పెళ్లికి నిరాకరించడంతో దాడి చేశాడని తెలిపింది. అంతేకాకుండా తనపై ఖర్చు చేసిన డబ్బు మొత్తం ఇచ్చేయాలని బెదిరిస్తున్నాడని చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఘటన వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. తమకు నటి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని రాయ్ బరేలి పోలీస్ అధికారి తెలిపారు. సోషల్ మీడియా పోస్టింగ్ పై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కాగా హీరోయిన్ తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రామ్ రతన్ ఈ ఆరోపణలు ఖండించారు.

హీరోయిన్ తృప్తి శంఖదార్ ప్రస్తుతం టిక్ టాక్ స్టార్ కిరణ్ హీరోగా రూపొందుతున్న ‘ఓయ్ ఇడియట్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.