వెంకీ 75వ సినిమా.. డైరెక్టర్ ఆయనేనా..?

0

టాలీవుడ్ వైవిధ్య సినిమాల హీరో విక్టరీ వెంకటేష్.. మరోసారి వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే నారప్ప. ఇది ఆయనకు 74వ సినిమా. తమిళంలో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ఇది రూపొందుతుంది. తెలుగులో ‘నారప్ప’గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ సినిమాతో మళ్లీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది హీరోయిన్ ప్రియమణి. ఇదివరకే విడుదలైన ‘నారప్ప’ పోస్టర్స్లో వెంకటేష్ ఉగ్రరూపం దాల్చారు. ఊర మాస్ గెటప్లో వెంకటేష్ పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ ప్రైజ్ చేశారు. అయితే ప్రస్తుతం వెంకటేష్ సిల్వర్ జూబ్లీ సినిమా గురించి చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన కెరీర్లో చాలా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే వెంకీ 75వ సినిమా ల కూడా సురేష్ ప్రొడక్షన్స్ వారే నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా డైరెక్టర్ ఎవరా అని కన్ఫర్మ్ కాలేదు. తాజా బజ్ ప్రకారం.. ఈ సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని టాక్. అలాగే ఆయన ఇదివరకే వెంకీ కోసం ఓ స్క్రిప్ట్ లాక్ చేసి ఉంచారని అంటున్నారు. కానీ నారప్ప తర్వాత వెంకీ తన 75వ సినిమా ప్రారంభిస్తారు. మరి త్రివిక్రమ్ ఓ పక్క ఎన్టీఆర్ 30వ సినిమా ఒప్పుకున్నాడు. ఎన్టీఆర్ మూవీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసిన త్రివిక్రమ్.. మరి వెంకీ మూవీ ఎప్పుడు చేస్తాడని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ ఎన్టీఆర్ సినిమా పక్కన పెట్టి వెంకీ సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి త్రివిక్రమ్ ఏమైనా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నాడా..? ఇద్దరు హీరోల సినిమాలు ఎలా రూపొందిస్తాడు? అసలు అంత టైం త్రివిక్రమ్ కు పాసిబుల్ అవుతుందని.. సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు చేస్తాడో.. చూద్దాం అంటున్నారు నెటిజన్లు ఫ్యాన్స్.