Templates by BIGtheme NET
Home >> Cinema News >> మెగాస్టార్ బర్త్ డే.. కోడలి ఎమోషనల్ ట్వీట్…!

మెగాస్టార్ బర్త్ డే.. కోడలి ఎమోషనల్ ట్వీట్…!


నేడు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగా అభిమానులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అందరూ చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వారి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చిరంజీవి కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. మెగా హీరోలందరూ చిరంజీవికి బర్త్ డే విషెస్ చేపినప్పటికీ.. ఉపాసన ట్విట్టర్ వేదికగా పెట్టిన స్ఫూర్తిదాయకమైన ట్వీట్ స్పెషల్ గా నిలిచింది.

కాగా ఉపాసన మామ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను షేర్ చేస్తూ భావోద్వేగమైన ట్వీట్ చేశారు. ”నిత్య కృషీవలుడు.. గొప్ప నమ్మకం ఉన్న వ్యక్తి.. దాయార్థ హృదయుడు.. ఎలాంటి సమయంలోనైనా మానసిక ధైర్యంతో ఉండే వ్యక్తి ఆయన. నేను ఆయన్ని మామయ్య అని పిలిస్తే.. ప్రపంచం మెగాస్టార్ అని పిలుస్తోంది. మీరంటే స్ఫూర్తి ఆరాధనభావం ఎప్పటికి ఉంటుంది” అంటూ ఉపాసన కొణిదెల ఎమోషన్ ట్వీట్ చేసి చిరుకి బర్త్ డే విషెస్ చెప్పింది. మామయ్యకి శుభాకాంక్షలు చెప్తూ కోడలు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.