Templates by BIGtheme NET
Home >> Cinema News >> వైరల్ అవుతున్న ఉప్పెన బ్యూటీ యాడ్ ఫిలిమ్స్!

వైరల్ అవుతున్న ఉప్పెన బ్యూటీ యాడ్ ఫిలిమ్స్!


ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే వచ్చిరాగానే ఈ కుర్రభామ తెలుగు ప్రేక్షకులమదిలో అలా ముద్రించుకుంది. నిజానికి కృతి పుట్టింది మంగళూరులోనే కానీ పెరిగింది అంతా ముంబైలోనే. అయితే చిన్నప్పటి నుండే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది కానీ అదే కెరీర్ అవుతుందని అనుకోలేదట. ఇండస్ట్రీలో డాక్టర్ అవ్వాలని అనుకోని యాక్టర్ అయినవాళ్లు వందల్లో ఉన్నారు. అలాంటివారిలో కృతి ఒకటి. ఆమెకు డాక్టర్ అవ్వాలని ఉండేదట. కానీ ఉప్పెన స్టోరీ నచ్చడంతో ఓకే చెప్పి యాక్టర్ అయిపోయింది. అయితే చిన్నప్పటి నుండి కృతి అసలు యాక్టింగ్ నేర్చుకోలేదట. కానీ చిన్నప్పటి నుండే యాడ్ ఫిలిమ్స్ చేయడంతో అమ్మడికి యాక్టింగ్ ఈజీ అయ్యిందని చెబుతోంది.

యాడ్స్ చేసిన అనుభవం మొత్తం ఉప్పెన ట్రైనింగ్ సెషన్స్ లో పెట్టిందట. కానీ ఒక్క సినిమాకే యాక్టింగ్ తో పాటు తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకుందంటే గ్రేట్ అనే చెప్పాలి. అయితే కృతి ఫస్ట్ లుక్ నుండి తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఎందుకంటే ఆమె నవ్వు కళ్లు మాట ఇలా ప్రతిదీ కృతి స్వచ్ఛంగా ప్రకటిస్తుంది. అయితే చిన్న వయసులోనే కృతి కమర్షియల్ యాడ్స్ లో కనిపించడం ఓ అడ్వాంటేజ్. ప్రస్తుతం కృతి చేసిన యాడ్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. వస్త్రాలకు సంబంధించిన యాడ్స్ తో పాటు కృతి.. డైరీమిల్క్ లైఫ్ బాయ్ ఓ పెన్స్ కంపెనీకి కమర్షియల్ యాడ్స్ చేసేసింది బేబమ్మ. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్ లో పెడుతోంది. ఉప్పెన రిలీజ్ ఏం చేయొచ్చు ఏం చేయకూడదు చూద్దాం అనుకుందట. కానీ మంచి ఆఫర్స్ వచ్చాయని నానితో శ్యామ్ సింగరాయ్ సుధీర్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పింది కృతిశెట్టి.