Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఊర్ఫీని అరెస్ట్ చేసి లోనేసిన పోలీస్

ఊర్ఫీని అరెస్ట్ చేసి లోనేసిన పోలీస్


ఆమె ఫ్యాషన్ ఎంపికలు ఎల్ల‌పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. ప‌బ్లిక్ లో అందాల జాత‌ర త‌న‌కు న‌చ్చిన‌ది చేయ‌డం ఆమె స్టైల్. వివాదాలు గొడ‌వ‌లు వగైరా త‌న‌కు చాలా రొటీన్. కానీ ఇప్పుడు ఈ స్ట‌యిలే త‌న కొంప ముంచింది. ప‌బ్లిక్ కి గ్లామ‌ర్ విందు ప‌సందు ఫ్రీగా ఇచ్చేస్తామంటే కుద‌ర‌దు. అరెస్టుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. పోలీసులు తోసుకుంటూ వెళ్లి జీపెక్కించేస్తారు. ఇదిగో ఇక్క‌డ ఊర్ఫీ జావేద్ స‌న్నివేశం చూస్తుంటే ఈ విష‌యం మీకు ఇట్టే అర్థ‌మైపోతుంది.

ఊర్ఫీకి సంబంధించిన ఒక వైరల్ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది, మహిళా పోలీసులు ఉర్ఫీ జావేద్‌ను బహిరంగంగా తోసుకుంటూ అదుపులోకి తీసుకున్నార‌ని ఈ వీడియో చెబుతోంది. ముంబైలో శుక్రవారం ఉదయం ఉర్ఫీ జావేద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చూపించే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ వైరల్ భయానీ ఈ వీడియోను షేర్ చేసారు. పోలీసు అధికారుల బృందం ఊర్ఫీని క‌లిసి తమతో పాటు పోలీస్ స్టేషన్‌కు రమ్మని అడుగుతున్న ఈ వీడియో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే ఊర్ఫీని ఇలా నిర్బంధించడానికి గల కారణాన్ని ప్రశ్నించినప్పుడు, ఒక అధికారి త‌న‌నే తిరిగి అడిగాడు, “ఇత్నే చోటే చోటే కప్డే పెహెంకే కౌన్ ఘుమ్తా హై?” (అలాంటి చిల్లర బట్టలు వేసుకుని ఎవరు తిరుగుతారు?) అనేదే ఆ ప్ర‌శ్న‌. 26 ఏళ్ల నటి కం మోడల్ ఊర్ఫీ జావేద్ ఈ వీడియోలో బ్యాక్‌లెస్ రెడ్ టాప్ లో క‌నిపించింది. ఓవైపు మ‌ళ్లీ మళ్లీ త‌న‌ను పోలీస్ స్టేష‌న్ కి పిల‌వ‌డానికి కారణాల కోసం అధికారులను అడుగుతున్నప్పటికీ వారు ఆమెకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఈ వీడియోని చూడ‌గానే ఎవ‌రూ ఇది నిజం అని న‌మ్మ‌రు. చాలా మంది నెటిజ‌నులు ఈ వీడియో ప్రామాణికతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఊర్ఫీ స్వయంగా చేసిన చిలిపి ప‌ని అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు నిజంగానే అరెస్టు అయిందేమో అంటూ గుస‌గుస‌లు ఆడారు. నిజంగానే అరెస్టు అయిందా? కేవలం చిలిపి వీడియోనా? అనేది ఎవ‌రికీ అర్థం కాలేదు. గతంలో ఈ భామ హ‌ద్దు మీరిన‌ ఫ్యాషన్ ఎంపికల కారణంగా ఇబ్బందుల్లో పడింది. గత నెలలో ఊర్ఫీ ఆర‌బోత‌పై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు చేసిన వెంటనే నటి పోలీస్ స్టేషన్‌ను సందర్శించింది. అయితే ఇప్పుడు అదే ఎపిసోడ్ ని ఇలా ఫ‌న్ ని జోడించి కావాల‌నే చిత్రీక‌రించింద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇదంతా కేవ‌లం ఇన్ స్టా రీల్ కోసం ప‌బ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టిపారేసేవారు లేక‌పోలేదు.