దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు విరహయోగినిలా

0

అగ్గి రాజేసే ఫోటోషూట్లతో విరుచుకుపడడం `హేట్ స్టోరీ 4` బ్యూటీ ఊర్వశి రౌతేలా కు కొత్తేమీ కాదు. నిరంతరం ఈ అమ్మడు ఇన్ స్టా మాధ్యమంలో ఈ తరహా ఫోటోలతో చెలరేగుతూనే ఉంది. ఈ సిరీస్ లో బికినీలు.. టూపీస్ స్విమ్ సూట్లు ఇప్పటికే అంతర్జాలంలో మంటలు పెట్టాయి.

అయితే వాటన్నిటికీ భిన్నంగా యష్ రాజ్ రౌతేలా.. బుల్లి!! అంటూ ఓ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసింది. “ప్రతి జీవితకాలంలో మిమ్మల్ని ఎన్నుకునే వ్యక్తి ఎవరో మీకు మీరు కనుగొంటారని నేను ఆశిస్తున్నాను. అన్నివేళలా ఎంపికలకు సిద్ధం కండి“ అంటూ నర్మగర్భ వ్యాఖ్యను చేసింది.

అన్నట్టు ఊర్వశి రౌతేలా ఇంతకుముందు ప్రియుడు టీమిండియా యంగ్ హిట్టర్ హార్థిక్ పాండ్యా సడెన్ గా విదేశీ భామ నటాషా స్టాంకోవిక్ ప్రేమలో పడి బిగ్ హ్యాండిచ్చాడు. ఆ స్ట్రోక్ నుంచి కోలుకుందో లేదో కానీ ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనా.. ఫోటోషూట్లపైనా దృష్టి సారించింది. లేటెస్టుగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ చూస్తుంటే దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు విరహయోగినిలా కనిపిస్తోంది. జీ5లో ఊర్వశి నటించిన వర్జిన్ భానుప్రియ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.

 

View this post on Instagram

 

#Natappuemmunnadabba LINK IN BIO 🎥 . . . . . . . . . . . . . . . . . . . . . #love #UrvashiRautela #BlackRose

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on