అసలు ఇంతందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ నిహారికా?

0

మెగా ప్రిన్సెస్ నిహారిక నెవ్వర్ బిఫోర్ లుక్ ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రఖ్యాత యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీపై సంథింగ్ స్పెషల్ గా డిజైనర్ లుక్ లో కనిపించి మనసులు దోచేసింది. ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఏనాడూ కనిపించనంత కొత్తగా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది ఈ వేషధారణలో. ఐజీ కుమారుడు చైతన్యను పెళ్లాడేందుకు మెగా ప్రిన్సెస్ సిద్ధమవుతున్న వేళ .. ఈ మేకోవర్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది.

ఇంతకీ ఈ బ్రైడల్ డిజైన్ చేసినది ఏ డిజైనర్? అన్నది పరిశీలిస్తే… హైదరాబాద్ పంజాగుట్ట మాంగత్రాయ్ డిజైనర్ డ్రెస్ ఇదని నిహారిక స్వయంగా ఇన్ స్టా లో వెల్లడించింది. అశ్విని రెడ్డి – వరుణ్ చక్కిలం ఔట్ ఫిట్స్ అందించగా .. శాండీ శాస్త్రి మేకప్ హెయిర్ డిజైన్ పనితనం కనబరిచారట. మొత్తానికి మెగా ప్రిన్సెస్ ని డెకరేట్ చేసిన తీరు వారెవ్వా అనిపిస్తోంది. నిహారిక ఈ గెటప్ లో పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. మునుపటి కంటే స్పెషల్ గా ఎలివేట్ అయ్యింది. ఇక ఈ లుక్ కోసమే ఇటీవల సెలబ్రిటీ ట్రైనర్ సమక్షంలో నిహారిక జిమ్ లో కఠోరంగా శ్రమించింది.

ఇన్నాళ్లలో వెబ్ సిరీస్ లు.. సినిమాల్లో కనిపించనంత స్పెషల్ గా తనని తాను ఆవిష్కరించుకుంది. అసలు ఇంతందం ఇన్నాళ్లు ఎక్కడ దాచావ్ నిహారికా? అంటూ మురిసిపోతున్నారంతా. అన్నట్టు పెళ్లి తర్వాతా నిహారిక సినిమాల్లో నటిస్తుందా లేదా? అన్నది మాత్రం ఇంతవరకూ వెల్లడి కాలేదు. అందం నట ప్రతిభకు కొదవేమీ లేదు కాబట్టి వెబ్ సిరీస్ లు సినిమాలకు అభ్యంతరం ఉండదనే మెగాభిమానులు భావిస్తున్నారు. ఇక నిర్మాతగానూ మెగా డాటర్ కెరీర్ ని సాగించే యోచన చేస్తున్న సంగతి విధితమే.