పప్పీకో ముద్దు బాగుంది కానీ.. మరీ ఇంతగానా?

0

క్వారంటైన్ సమయంలో టైమ్ పాస్ ఎలా? అంటే ఇదిగో ఇలా పెట్ డాగ్స్ తో కాలక్షేపం చేయడానికి సెలబ్రిటీలంతా ఆసక్తి చూపిస్తున్నారు. చిరంజీవి.. చరణ్.. దేవరకొండ.. ఛార్మి .. పూరి .. ఇలా ప్రముఖులంతా కోవిడ్ వల్ల బయటకు వెళ్లకుండా ఇండ్లలోనే ఉండిపోయారు. నచ్చినట్టుగా పెట్స్ తో ఆడుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటే బోరింగ్ గా ఉంటోంది. ఎప్పుడెప్పుడు షూటింగుకి వెళదామా? అన్న ఆత్రాన్ని కనబరుస్తున్నారు కొందరైతే.

ఇక పెట్ డాగ్స్ తో ఆడుకోవడంలో తనని కొట్టేవాళ్లే లేరు అన్నట్టుగా ఈ అమ్మడు ఎలా పెదవి ముద్దు ఇచ్చేస్తోందో చూశారుగా.. హైబ్రీడ్ పెట్ డాగ్ ఎంత ముద్దొచ్చేస్తోందో. పందెంకోడి 2 విలన్ వరలక్ష్మి ఈ పెట్ డాగ్ ని అల్లారుముద్దుగా పెంచుకుంటోంది అనడానికి ఇంతకంటే ప్రూఫ్ ఏమైనా కావాలా?

కాస్త ఆకారంలో పెద్దగానే ఉన్నా ఎంతో ముద్దుగా ఉన్న ఈ బ్రీడ్ డాగ్స్ యజమానులను ఇట్టే అల్లుకుపోతుంటాయి. మొత్తానికి వరలక్ష్మి తీరిక సమయాన్ని ఇలా వెచ్చిస్తోంది. ఇక ఈ అమ్మడు ఇటీవల టాలీవుడ్ లో పలు క్రేజీ చిత్రాల్లో విలన్ గా నటిస్తూ బిజీగా ఉంది. అవన్నీ కోవిడ్ వల్ల షూటింగులు పూర్తి కాలేదు. వాటికి సంబంధించి వరలక్ష్మి ఏదైనా అప్ డేట్ చెబుతుందేమో చూడాలి. రవితేజ క్రాక్ లో వరలక్ష్మి పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉండనుందన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.