వరుడుగా మారుతున్న నాగశౌర్య?

0

టాలీవుడ్ లో వరుస పెళ్లిళ్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. నిఖిల్.. రానా.. నితిన్.. ఇలా వరుసగా హీరోలంతా ఓ ఇంటివాళ్లయిపోయారు. ఇంకా టాలీవుడ్ లో పెళ్లీడుకొచ్చిన హీరోలు ఉన్నారు. ఇందులో నాగశౌర్య కూడా ఉన్నాడు. ఈ ట్యాలెంటెడ్ హీరో గత కొంతకాలంగా పూర్తిగా కెరీర్ పైనే శ్రద్ధ పెట్టి వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు.

అయితే శౌర్యపై ఇంట్లో ఏమంత ప్రెజర్ లేనట్టే కనిపిస్తోంది. అందుకే అతడు తాపీగా వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఇటీవల అతడి 6 ప్యాక్ లుక్… గుబురు గడ్డం లుక్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ని ఇచ్చాయి. ప్రస్తుతం అతడు ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్ లతో ఫుల్ స్వింగులో ఉన్నాడు. ఇవేగాక మరిన్ని కథలు విని దర్శకుల్ని లాక్ చేశాడన్న సమాచారం ఉంది.

ప్రస్తుతం సౌజన్య దర్శకత్వం వహించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రీకరణలో శౌర్య బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూట్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. పెళ్లి చూపులు ఫేం రీతు వర్మ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి `వరుడు కావలెను` అనే టైటిల్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. యాథృచ్ఛికమే అయినా కాబోయే వరుడు నాగశౌర్య అనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంతకుముందు బన్ని వరుడు టైటిల్ తో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వరుడు టైటిల్ ని ఎంచుకుని శౌర్య ఆసక్తిని పెంచుతున్నాడు. అయితే ఈ టైటిల్ ని ఇంకా చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా.. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవికి మూవీ విడుదల కానుంది. సంతోష్ జాగర్లాపుడి దర్శకత్వంలో నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ కూడా సైమల్టేనియస్ గా చేస్తున్నారు. మహమ్మారీ భయాల నడుమ కూడా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో శౌర్య ఎక్కడా తగ్గడం లేదు.