Templates by BIGtheme NET
Home >> Cinema News >> మరో వేడుకకు సిద్దమవుతున్న మెగా జోడి

మరో వేడుకకు సిద్దమవుతున్న మెగా జోడి


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. మెగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించారు. వారం రోజులు ముందుగానే ఇటలీ వెళ్ళిపోయిన మెగా ఫ్యామిలీ అక్కడ వెకేషన్ ని కూడా ఆశ్వాదించారు.

పెళ్లి వేడుక ముగియడంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. పెళ్లి అయిన మరుసటి రోజే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చేశారు. ఆ వీడియో ఇప్పటికే వైరల్ అయ్యింది. ఇప్పుడు వరుణ్, లావణ్య కూడా కొత్త భార్యాభర్తలుగా అడుగుపెట్టారు.

మెగా ఫ్యాన్స్ వీరికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. పుష్పగుచ్చాలు ఇచ్చి వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మరో వైపు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ లో పెళ్లిలో కుటుంబ సభ్యులు అందరూ కలిసి దిగిన ఫోటోలని షేర్ చేసుకున్నారు.

నా అందమైన కుటుంబం అంటూ ఉపాసన పిక్స్ పంచుకున్నారు. ఎన్నో మధుర జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభవాలని అందించిన వరుణ్, లావణ్యకి ధన్యవాదాలు, మెగా కుటుంబంలోకి లావణ్యకి గ్రాండ్ వెల్ కమ్ అంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పిక్స్ తో లావణ్య త్రిపాఠిని ప్రేమగా బుగ్గల మీద కిస్ చేస్తూ ఉపాసన, స్నేహారెడ్డి ఉన్న ఫోటో కూడా పంచుకున్నారు.

వరుణ్, లావణ్య రిసెప్షన్ ని నవంబర్ 5న గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు అందరూ హాజరు కానున్నారు. లావణ్య త్రిపాఠికి చెందిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా ఈ రిసెప్షన్ కి రానున్నారు. రేపు గ్రాండ్ గా జరగబోయే ఈ రిసెప్షన్ కి ఇప్పటికే రంగం సిద్ధమైంది. అందరికి ఆహ్వానాలు కూడా వెళ్ళిపోయాయి. సెలబ్రేషన్స్ అన్ని అయిపోయాక వచ్చే నెల నుంచి మరల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎవరి ప్రాజెక్ట్స్ లో వారు బిజీ కానున్నట్లు తెలుస్తోంది.