నన్ను చూడు నా సన్నజాజి నడుమందం చూడు

0

రాఘవ లారెన్స్ నటించి డైరెక్ట్ చేసిన కామెడీ హారర్ థ్రిల్లర్ `ముని` తో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది వేదిక. తొలి మూవీతోనే ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఆ తరువాత నారా రోహిత్ తో చేసిన `బాణం` ఆమెకు హోమ్లీ హీరోయిన్ గా ముద్ర వేసింది. దాన్ని చెరిపేసుకుని గ్లామర్ తారగా గుర్తింపుని దక్కించుకోవడానికి చాలా కాలమే పట్టింది.

ఆశించిన స్థాయిలో అవకాశాలు అందకపోవడంతో తమిళ చిత్రాలకే పరిమితమైన వేదిక మళ్లీ లారెన్స్ మూవీ `ముని 4` కాంచన 3తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఈ సారి మళ్లీ వెనక్కి తిరిగిచూసుకోకూడదని గట్టిగా ఫిక్సయినట్టుంది. గ్లామర్ డోసు పెంచేందుకు సిద్ధమంటూ ఇన్ స్టా వేదికగా హాట్ ఫొటోలతో నెటిజన్స్ ని బుట్టలో పడేస్తూ క్రేజ్ ని పెంచుకునే కార్యక్రమం పెట్టేసుకుంది.

తాజాగా ఒళ్లంతా గులాబీ మయం అయ్యేలా లెహెంగా ను ధరించి గులాబీలతో గాలం వేస్తోంది. ఒక అందమైన పింక్ గులాబీ రోడ్ పై ఫోజులిస్తున్నట్టుగా.. మల్లెతీగ లాంటి నాజూకు నడుమందాలతో కుర్రకారుని పిచ్చెక్కిస్తోంది కదూ? నన్ను చూడు నా నడుమందం చూడు అన్నట్టుగా హొయలు పోతోంది. బాలయ్యతో చేసిన `రూలర్` ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో తెలుగు తమిళ భాషల్లో `జంగిల్` మూవీ చేస్తోంది. ఇది తన కెరీర్ ని కొత్త మలుపు తిప్పుతుందని వేదిక గట్టి నమ్మకంతో వుంది. ఇంతగా ట్రై చేశాక అయినా కనికరించకపోతారా మన మేకర్స్?