మార్చి నెలలో నారప్ప విడుదల !?

0

ఈ ఏడాది సమ్మర్ లో విడుదల అవ్వాల్సిన సినిమాలు అన్ని కూడా వాయిదా పడ్డాయి. మార్చి నుండి లాక్ డౌన్ అవ్వడం వల్ల థియేటర్లు ఓపెన్ లేక వందల కొద్ది సినిమాలు ఆగిపోయాయి. కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని ఆగిపోగా మరికొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నవి.. కొన్ని మద్యలో ఉన్నవి కూడా ఆగిపోయాయి. షూటింగ్ లకు అనుమతులు రావడంతో గత నెల రెండు నెలలుగా హడావుడి కనిపిస్తుంది. ఈ నెలతో పూర్తి స్థాయి షూటింగ్ లు మొదలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వెంకటేష్ నారప్పను వచ్చే ఏడాదిలో పునః ప్రారంభించాలని అనుకున్నారు. కాని ఇతర ప్రాజెక్ట్ లు ఆగిపోతున్న కారణంగా నారప్పను మొదలు పెట్టారు.

నారప్ప సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతుంది. త్వరలోనే సినిమా షూటింగ్ ను ముగించేయాలని భావిస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో షూటింగ్ ప్లానింగ్ లో కాస్త మార్పులు చేసి షెడ్యూల్ రోజులను తగ్గించారు. దాంతో ఈ నెలాఖరు వరకు లేదా వచ్చే నెలలో షూటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఇక చాలా పెద్ద చిన్న సినిమాలు సమ్మర్ లో రిలీజ్ కు వెయిట్ చేస్తున్నాయి. ఇప్పుడు నారప్ప కూడా మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది.

సాదారణంగా అయితే మార్చి నెలలో పరీక్షల సీజన్ కనుక సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దంగా ఉండరు. కాని ఈసారి విద్యాసంవత్సరం ఆలస్యంగా మొదలు అవుతుంది కనుక మే లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అందుకే మార్చి రెండవ వారంలో నారప్పను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సురేష్ ప్రొడక్షన్స్ నుండి సమాచారం అందుతోంది. తమిళ అసురన్ ను తెలుగులో నారప్పగా సురేష్ బాబు మరియు తమిళ నిర్మాత కళై పులి ఎస్ థాను లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ రీమేక్ రూపొందుతుంది.